విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాను ప్రకటించాడు. గత కొన్ని రోజులుగా వెంకటేష్ 75వ సినిమా గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తదుపరి సినిమా చేసేవారిలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వెంకీ సినిమాలు చేయనున్నట్లు ఆ మధ్య టాక్ వినిపించింది. ఆ తర్వాత త్రినాథ్ రావు నక్కిన, తేజ, అనీల్ రావిపూడి వంటి దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే అవి పేర్ల వరకే పరిమితం అయ్యాయి.
వెంకీ తన సినిమా గురించి ఎంతకీ చెప్పకపోవడంతో ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పాడనే వార్తలు కూడా వినిపించాయి. చాలా మందిలో ఆ డౌట్స్ కూడా వచ్చాయి. తాజాగా వెంకటేష్ ఆ వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు. వెంకీ తన తదుపరి సినిమాను సైలేష్ కొలను దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించారు. చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే జనవరి 25 వరకూ వేచి ఉండాల్సిందేనని మేకర్స్ తెలిపారు.