సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జూన్లో జరగనున్నట్లు పింక్ విల్లా సౌత్ మీడియా(Pink villa south Media) సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి(marriage) జరగనున్నట్లు పింక్ విల్లా స్పష్టం చేసింది.
టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్లి(marriage) మ్యాటర్ వైరల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఏకంగా వీరి పెళ్లి గురించి జాతీయ మీడియాలో సైతం వచ్చేసింది. సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జూన్లో జరగనున్నట్లు పింక్ విల్లా సౌత్ మీడియా(Pink villa south Media) సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి(marriage) జరగనున్నట్లు పింక్ విల్లా స్పష్టం చేసింది.
గత కొన్నేళ్లుగా ఈ క్యూట్ జంట పలు పార్టీలకు, ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరవుతూ వస్తోంది. అయితే వారిద్దరి మధ్య అనుబంధం గురించి ఎక్కడా బయటపెట్టలేదు. ఆ మధ్య ఎప్పుడో తామిద్దరం స్నేహితులం మాత్రమేనని వరుణ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) జంట మీడియా ముఖంగా చెప్పింది.
అయితే ప్రస్తుతం పింక్ విల్లాలో వచ్చిన కథనంలో నిజం ఎంత ఉందో తెలియడం లేదు. మెగా ఫ్యామిలీ (Mega Family) నుంచి వీరిద్దరి బంధం గురించి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. కనీసం లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) అయినా దీనిపై స్పందిస్తుందేమోనని అందరూ ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. మొత్తానికి పింక్ విల్లా (Pink villa south Media) మాత్రం కాస్త ధైర్యం చేసి వీరిద్దరికీ జూన్ నిశ్చితార్థం ఉందని, ఆ తర్వాత పెళ్లి కూడా జరుగుతుందని తేల్చి చెప్పేసింది. ఇందులో నిజం ఏంటో తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే.