సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ (Personal life) గురించి విమర్శలు గుప్పించడం కామన్ అయింది.చాలా మంది ట్రోలర్లు ఇదే పనిగా పెట్టుకుని ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శిస్తూనే ఉన్నారు.తను వెకేషన్‌కు వెళ్లినా, ఏదైనా పోస్ట్ పెట్టినా.. ఏం చేసినా సరే తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ నెగెటివిటినీ నిహారిక (Niharika) లైట్ తీసుకుని తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య సాయిధరమ్ తేజ్ ‘సత్య'(Satya) అనే షార్ట్ ఫిలిం చేసిన సంగతి తెలిసిందే! ఇందులో ఒక పాటను ఆగస్టు15న రిలీజ్ చేశారు.
దీనికి ‘సాంగ్ చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని నిహారిక రిప్లై ఇచ్చారు. అయితే ఆమె కామెంట్‌ను ఓ నెటిజన్ (Netizen) ‘వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫ్యామిలీ మీద లేకపోయే’ అని నిహారిక విడాకుల విషయమై ట్రోల్ చేశాడు. దీంతో తేజ్ కోపంతో ‘నోరు అదుపులో పెట్టుకో. వెంటనే ఆ కామెంట్ డిలీట్ చేయ్’ అని అతడికి వార్నింగ్ (Warning) ఇచ్చాడు.నిహారిక కోసం తేజ్ అండగా నిలబడడాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే నెటిజన్ కామెంట్‌తో పాటు తేజ్ తన కామెంట్‌ను సైతం డిలీట్ చేశాడు. కానీ అప్పటికే అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియా(Social media)లో వైరల్‌గా మారింది.