Balayya – Tarak : ఇది నిజం.. బాలయ్యకు విలన్‌గా తారక రత్న ఫిక్స్, కానీ ఈలోపే!
Balayya - Tarak : నందమూరి తారకరత్న మరణం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 23 రోజుల పాటు మరణంతో పోరాడి 39 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న. అది కూడా నాలుగు రోజుల్లో పుట్టిన రోజు ఉండగా.. తారక రత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం.. మరింత కలిచివేసింది.
నందమూరి తారకరత్న మరణం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 23 రోజుల పాటు మరణంతో పోరాడి 39 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న. అది కూడా నాలుగు రోజుల్లో పుట్టిన రోజు ఉండగా.. తారక రత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం.. మరింత కలిచివేసింది. అయితే అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఫ్యామిలీతో పాటు తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్.. తారకరత్న భౌతికకాయాన్ని చూస్తూ మౌనంగా నిలబడి పోయారు. ఈ దృశ్యం అందరి హృదయాలను కలచివేసేలా ఉంది. ఇక నివాళులు అర్పించడానికి ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చిన వారంతా.. తారకరత్నతో తమకి ఉన్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘తారకరత్న అందరితో చాలా ప్రేమగా ఉండే వాడు, ఇది చాలా బాధాకరమైన విషయమని’ కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘తారకరత్న ఇంత చిన్న వయసులో మరణించడం బాధాకరం. ఎన్బీకె 108 సినిమాలో తారకరత్నకి మంచి పాత్రని ఇవ్వాలని బాలయ్య అడిగారు. మేమంతా తారకరత్నతో మంచి పాత్ర చేయించాలి అని నిర్ణయం తీసుకోని రెడీ అవుతున్న సమయంలో.. ఇలాంటి సంఘటన జరిగిందని’ అని చెప్పారు. దాంతో తారకరత్న కోసం బాలయ్య ఎంత కేరింగ్‌గా ఉండే వారో అర్థం చేసుకోవచ్చు. అసలు తారక రత్న హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి.. బాలయ్యకు కంటి మీద కునుకు లేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి చెప్పిన మాటలను బట్టి చూస్తే.. తారక రత్నకు సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు బాలయ్య. తారక రత్న కూడా సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. ఒకవేళ తారక రత్న కోలుకొని ఉంటే.. టాలీవుడ్లో మోస్ట్ వాంటేడ్ విలన్‌గా నిలిచేవాడు. కానీ అనుకున్నవన్నీ జరగవు కదా..!