సోషల్ మీడియాలో ఏది నిజం.. ఏది అబద్దం.. అని నమ్మడం చాలా కష్టం. ముఖ్యంగా సినిమాల విషయంలో ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఒక్కోసారి మేకర్స్ అఫిషీయల్ అప్టేట్స్ ఇచ్చినట్టుగా.. ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తుంటారు కొందరు. ఇప్పుడు మెగా వపర్ స్టార్ ఆర్సీ 16 విషయంలోను ఇదే జరిగింది. తీరా దాని గురించి తెలిశాక.. చరణ్ ఫ్యాన్స్‌కు మండిపోతోంది. రేయ్.. రేయ్.. నిజం అనుకున్నాం కదరా బాబు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar)తో గేమ్ ఛేంజర్ మూవీ(Game Changer Movie) చేస్తున్నాడు మెగా పవర్ స్టార్. ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఆర్సీ 16(RC 16) ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫిషీయల్‌గా ప్రకటించారు. వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు బుచ్చిబాబు. ఈ ఇయర్ ఎండింగ్లో ఆర్సీ 16 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ ఊహించని విధంగా.. సోషల్ మీడియాలో ఓ పోస్టర్(Poster) బయటికి రావడంతో.. మెగా ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చినంత పనైంది.
ఒక్కోసారి సోషల్ మీడియాలో కనిపించే క్రియేటివిటీ.. డమ్మీకే మమ్మీలా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చూస్తే.. మేకర్స్ కూడా ఆశ్చర్యపోయేలా ఉంటాయి. కొన్నిసార్లు అఫీషియల్ పోస్టర్స్ కంటే ఫ్యాన్స్ క్రియేట్ చేసే ఫేక్ పోస్టర్స్ వైరల్ అవుతుంటాయి. ఫ్యాన్స్ కూడా అలాంటి పోస్టర్స్ వచ్చినపుడు నిజమేనని అనుకుంటారు. కానీ అసలు విషయం తెలిశాక క్రియేటివిటీ రాయుళ్లకు మామూలుగా ఉండదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అదే జరుగుతోంది. త్వరలోనే ఆర్సీ 16 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రాబోతోందంటూ ఒక పోస్టర్ ట్విట్టర్లో వైరల్ అయ్యింది.
పోస్టర్ పై ‘కొన్నిసార్లు, తిరుగుబాటు అవసరం అవుతుంది’ అంటూ రాసుకొచ్చాడు. అచ్చు సినిమా పోస్టర్‌లాగే జైలు, కడ్డీలను పట్టుకున్న చేతులతో పోస్టర్ డిజైన్ చేశాడు. దీంతో మెగాభిమానులు ఆ పోస్టర్ నిజమేనని అనుకున్నారు. కానీ కామెంట్స్ చూస్తే గానీ.. అసలు మ్యాటర్ అర్థం కాదు. అది ఫేక్ పోస్టర్ అని తెలియడంతో.. మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్లో క్రియేటర్‌ను ఆడేసుకుంటున్నారు. ఒరేయ్ బాబు.. నిజం అనుకున్నాం కదరా.. అంటూ కొన్ని వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా.. ఫేక్ పోస్టర్‌తో మెగా ఫ్యాన్స్‌నే నమ్మించాడంటే.. అతని క్రియేటివిటిని మెచ్చుకోవాల్సిందే.