»People Pray And Do Puja For Rrr Naatu Naatu Song To Get Oscar Academy Award In Telugu States
RRR-Oscar Awards: ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ రావాలని తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పూజలు
మరికొన్ని గంటల్లో ఆస్కార్ అవార్డు(Oscar Awards)లను ప్రకటించనున్నారు. ఆర్ఆర్ఆర్(RRR) నుంచి నామినేట్ అయిన 'నాటు నాటు'(Natu Natu) పాట గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ఆ పాటకు సపోర్ట్ గా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు(Oscar Award) రావాలని కోరుకుంటున్నారు. రాజమండ్రిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశారు.
మరికొన్ని గంటల్లో ఆస్కార్ అవార్డు(Oscar Awards)లను ప్రకటించనున్నారు. ఆర్ఆర్ఆర్(RRR) నుంచి నామినేట్ అయిన ‘నాటు నాటు'(Natu Natu) పాట గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ఆ పాటకు సపోర్ట్ గా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు(Oscar Award) రావాలని కోరుకుంటున్నారు. రాజమండ్రిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశారు.
గోదావరి గట్టుపై ‘నాటు నాటు'(Natu Natu) పాటకు స్టెప్పులేస్తూ ఆర్ఆర్ఆర్(RRR) టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు(Oscar Award) రావాలని సింహాద్రి అప్పన్న సన్నిధిలో అభిమానులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ ఆవరణలో 101 కొబ్బరికాయలు కొట్టారు. స్వామికి తమ మొక్కులు చెల్లించుకుని ఆర్ఆర్ఆర్(RRR)కు అవార్డులు రావాలని కోరుకున్నారు.
ఆర్ఆర్ఆర్(RRR)లో ‘నాటు నాటు’ పాట రాసిన రచయిత చంద్రబోస్ స్వగ్రామంలో కూడా సందడి వాతావరణం నెలకొంది. ఆయన రాసిన పాట ఆస్కార్ బరిలో ఉండటంతో ఆయన అభిమానులు, బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రచయిత చంద్రబోస్ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘నాటు నాటు'(Natu Natu) పాటకు ఆస్కార్ అవార్డు తప్పకుండా వచ్చి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఆస్కార్ ఫీవర్ ఎక్కువైందని చెప్పాలి. ప్రపంచ సినీ వేదికపై తెలుగు పాట ఖ్యాతిని నిలబెట్టాలని ఆర్ఆర్ఆర్(RRR) టీమ్ కు అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.