Rana naidu web series:బాబాయ్ అబ్బాయ్ కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana naidu) నిన్నటి నుంచి నెట్ ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 10 ఎపిసోడ్లు ఉండగా.. మొత్తం న్యూడిటీ ఉంది. వెబ్ సిరీస్ గురించి వెంకటేష్ సోదరుడు, రానా తండ్రి సురేష్ బాబు (suresh babu) స్పందించారు. తాను ఆ వెబ్ సిరీస్ చూడాలని అనుకోవడం లేదని చెప్పేశారు.
విమర్శకుల ప్రశంసలు అందకుంటూ విజయం దిశగా దూసుకెళ్తున్న సినిమా ‘బలగం (Balagam Movie)’. తెలంగాణ (Telangana) గ్రామీణ నేపథ్యంలో కుటుంబ అనుబంధాల (Family Sentiments) ఇతివృత్తంగా జబర్దస్త్ నటుడు వేణు యెల్దండి (Venu Yeldandi) తెరకెక్కించిన సినిమా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా బృందాన్ని మెగాస్టార్ (Megastar) చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు వేణును సన్మానించి ప్రశంసల వర్షం కురిపించాడు..
ఇంకేం కావాలి నాకు 20 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని రోజును చిరంజీవి గారు నాకు ఇచ్చారు. థాంక్యూ సో మచ్ సార్. నా జీవితాంతం గుర్తుండిపోయే క్షణం నాకు. ఇది నా బలగం విజయం.
NTR : ప్రస్తుతం ట్విట్టర్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను రేంజ్‌లో ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇప్పటి వరకు మావాడు సరిగ్గా కన్సట్రేట్ చేయలేదు గానీ.. సూటు, బూటు వేస్తే.. ఎవ్వరైనా దిగదుడుపే అంటూ సంబరపడిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. యంగ్ టైగర్ కాస్త స్టైలిష్ టైగర్‌గా మారిపోయాడని అంటున్నారు.
Rana Naidu : ఇప్పటి వరకు దగ్గుబాటి హీరోలు.. బాబయ్, అబ్బాయ్ వెంకటేష్, రానా స్క్రీన్ పై అలా కనిపించి.. ఇలా వెళ్లిపోయారు. అందుకే పూర్తి స్థాయిలో కలిసి నటిస్తే చూడాలనేది దగ్గుబాటి ఫ్యాన్స్ కోరిక. ఎట్టకేలకు ఇద్దరు కలిసి ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
Power Star : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టిన 'హరిహర వీరమల్లు' షూటింగ్ కంప్లీట్ అవకముందే.. 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Tollywood Heros : ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు.. ఈ ముగ్గురు బడా హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. థియేటర్ల వద్ద మాస్ జాతర జరుగుతుంది.. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ పీక్స్‌లో ఉంటుంది. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి ఇదే జరగబోతోందనే ప్రచారం జరుగుతోంది.
Chiranjeevi : ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత.. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్ సోసోగానే నిలిచినా.. వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. మెగాస్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
అదేదో సామెత అన్నట్టు.. సీనియర్ హీరో నరేష్, పవిత్ర అసలై దసరా పండగ చేసుకుంటున్నారు. ఎవ్వరు ఏమనుకున్నా సరే.. తగ్గేదేలే అంటున్నారు. లోకులు కాకులు అనే మాటను తు.చ.తప్పకుండా పాటిస్తున్నారు. పలు సినిమాల్లో కలిసి నటించిన.. నరేష్, పవిత్ర గత కొద్ది రోజులుగా ఘాడమైన ప్రేమలో ఉన్నారు.
టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు(Mahesh Babu)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంటారు. ఇప్పటికే మహేశ్ బాబు ఓ ఫౌండేషన్ ను నెలకొల్పి ఎంతో మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఫ్రీగా ఆపరేషన్లు చేయిస్తున్నాడు. మహేశ్ బాబు అడుగుజాడల్లోనే ఆయన భార్య నమ్రత(Namrata) కూడా నడుస్తున్నారు.
Mrunal Thakur : తెలుగు ఆడియెన్స్‌కు సీతగా చాలా దగ్గరైంది బలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠకూర్. సీతారమం సినిమాలో అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు మనోళ్లు. అయితే 'సెల్ఫీ' అనే బాలీవుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో రెచ్చిపోయింది. సీత స్కిన్ షోకి కుర్రాళ్లు షాక్ అయ్యారు.
Allu Arjun : ప్రస్తుతం ఇండియాలో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్‌దే ఫస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్లు తీసుకుంటున్నాడు డార్లింగ్. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రభాస్ పారితోషికాన్ని టచ్ చేసినట్టు తెలుస్తోంది.
Venu : బలగం సినిమా చూసిన తర్వాత.. ఇలాంటి మంచి సినిమా అందించినందుకు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు. సినిమా రిలీజ్ అయి వారం రోజులు అవుతున్నా.. రోజు రోజుకి బాక్సాఫీస్ దగ్గర మరింతగా బలపడుతునే ఉంది బలగం.
NTR : మార్చి 12 జరగనున్న ఆస్కార్ వేడుక కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ రావడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు ఇండియన్స్. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ టీం అంతనా అమెరికాలో సందడి చేస్తోంది.
Prabhas : పాన్ ఇండయా స్టార్ ప్రభాస్‌కి మళ్లీ ఏమైందని.. ఆందోళన పడుతున్నారు అభిమానులు. ఎప్పటికప్పుడు ప్రభాస్ హెల్త్ పై సోషల్ మీడియాలో ఏదో ఒక పుకారు వినిపిస్తునే ఉంది. రాధే శ్యామ్ రిలీజ్ అయిన వెంటనే.. సలార్ సెట్స్‌లో ప్రమాదానికి గురయ్యారని.. మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడని వినిపించింది.