NTR కామెంట్స్ వైరల్.. ఆస్కార్ వేదిక పై హీరోగా కాకుండా..!
NTR : మార్చి 12 జరగనున్న ఆస్కార్ వేడుక కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ రావడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు ఇండియన్స్. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ టీం అంతనా అమెరికాలో సందడి చేస్తోంది.
మార్చి 12 జరగనున్న ఆస్కార్ వేడుక కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ రావడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు ఇండియన్స్. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ టీం అంతనా అమెరికాలో సందడి చేస్తోంది. చరిత్రకు ఒక్క రోజు, ఒక్క అడుగు దూరంలో ఉన్నారు దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ మూమెంట్ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నామని పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు ఈ త్రిమూర్తులు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ప్రముఖ అమెరికన్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆర్ఆర్ఆర్ హీరోగానో, జూనియర్ ఎన్టీఆర్గానో, కోమురం భీమ్గానో కాకుండా.. ఒక భారతీయుడిగా ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై ఎంతో గర్వంగా నడవబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. గుండెల నిండా భారతీయతను నింపుకొని రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టే క్షణాల కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నానంటూ తెలిపాడు. అలాగే నాటు నాటు సాంగ్‌కు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. సాంగ్ షూటింగ్‌కి వారం రోజుల ముందు చాలా సార్లు ప్రాక్టీస్ చేశామని.. షూటింగ్ టైంలో ఎన్నో సార్లు రిహార్సల్స్ చేశామని.. ఇప్పటికీ నా కాళ్ళు హర్ట్ అయ్యే ఉన్నాయని.. చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్టే.. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది నాటు నాటు సాంగ్. ఆస్కార్ తర్వాత ఆస్కార్ అంత చెప్పుకునే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కూడా సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆస్కార్ అందుకోవడమే ఆలస్యం. మరి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకొని.. చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.