HNK: ఐనవోలు మల్లికార్జున దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసినట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. 13 మంది సభ్యులు ఉండగా ఒకరు దాత, మరొకరు ఆలయ అర్చకుడు ఉంటారు. 15 మంది ధర్మకర్తలతో కమిటీని ఏర్పాటు చేయగా నియోజకవర్గ పరిధిలోని పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు మండలాలకు చెందిన వారికి కమిటీలో చోటు కల్పించారు.