»Naresh Pavitra Got Married Enjoying The Honeymoon
Naresh, Pavitra got married : ఇది దసరా పండగ అంటే.. పెళ్లి చేసుకున్నారు, ఇసుక తెన్నెల్లో హనీమూన్! (నరేష్, పవిత్ర)
అదేదో సామెత అన్నట్టు.. సీనియర్ హీరో నరేష్, పవిత్ర అసలై దసరా పండగ చేసుకుంటున్నారు. ఎవ్వరు ఏమనుకున్నా సరే.. తగ్గేదేలే అంటున్నారు. లోకులు కాకులు అనే మాటను తు.చ.తప్పకుండా పాటిస్తున్నారు. పలు సినిమాల్లో కలిసి నటించిన.. నరేష్, పవిత్ర గత కొద్ది రోజులుగా ఘాడమైన ప్రేమలో ఉన్నారు.
అదేదో సామెత అన్నట్టు.. సీనియర్ హీరో నరేష్, పవిత్ర అసలై దసరా పండగ చేసుకుంటున్నారు. ఎవ్వరు ఏమనుకున్నా సరే.. తగ్గేదేలే అంటున్నారు. లోకులు కాకులు అనే మాటను తు.చ.తప్పకుండా పాటిస్తున్నారు. పలు సినిమాల్లో కలిసి నటించిన.. నరేష్, పవిత్ర గత కొద్ది రోజులుగా ఘాడమైన ప్రేమలో ఉన్నారు. అయితే కొత్త సంవత్సరం సందర్భంగా తమ ప్రేమ విషయాన్ని అధికారింగా బయటపెట్టారు. దీంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసింది. పర్సనల్ విషయాలను కూడా పబ్లిక్‌లో పెట్టేసింది. దానికి కౌంటర్‌గా నరేష్ కూడా చెప్పుకోలేని విషయాలు వెల్లడించాడు. ఇంకా ఈ వివాదం నడుస్తునే ఉంది. అయితే ఈ మధ్య సైలెంట్‌గా ఉన్న నరేష్, పవిత్ర.. తాజాగా పెళ్లి చేసుకుని షాకిచ్చారు. అందరి ఆశీస్సులు కావాలంటూ తమ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీళ్ల మ్యారేజ్ జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ జంటకు తమదైన స్టైల్లో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. అయితే కొందరు మాత్రం వీళ్లు నిజంగానే పెళ్లి చేసుకున్నారా.. లేదంటే ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారా.. అనే సందేహాలు వెలువడుతున్నాయి. కానీ ఈ క్రేజీ జోడీ పెళ్లే కాదు.. అప్పుడే హనీమూన్‌కు కూడా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ కొత్త జంట దుబాయ్‌లో షికారు చేస్తున్నాట్టు వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. వీళ్ల జోరు చూస్తుంటే.. కొత్త పెళ్లి జంట కూడా ఈ రేంజ్లో హనీమూన్ చేసుకోరేమో.. అనేలా ఉంది వ్యవహారం. ఏడారిలో ఇసుక తెన్నెల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అన్నట్టు నరేష్‌కు ఇది నాలుగో పెళ్లికాగా.. పవిత్రా లోకేశ్‌కు మూడో పెళ్లి. ఏదేమైనా నరేష్, పవిత్ర అంటే ఆ మాత్రం ఉంటది మరి!