పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' పై రోజు రోజుకి అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా కోసం బడా బడా స్టార్ హీరోలంతా రంగంలోకి దిగుతున్నారు. వేలకు వేలే టికెట్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు ఆదిపురుష్‌ను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆదిపురుష్ టికెట్స్ బుక్ చేస్తున్నట్టు సమాచారం.
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ గురించి ఏపీ సీఎంవో స్పందించింది. డాక్యుమెంట్ ప్రక్రియ పూర్తి చేసి ఆర్థిక సాయం అందిస్తామని సీఎంవో అధికారి తెలిపారు.
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్' సినిమా.. ఎంత పెద్ద డిజాస్టర్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా వివాదం కొనసాగుతునే ఉంది. ఈ సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ పూరి పై కాస్త గట్టిగానే పడింది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం అటకెక్కింది. దాంతో విజయ్, పూజా హెగ్డే ఇక కలిసి నటించరు అనుకున్నారు. కానీ తాజాగా మరోసారి ఈ జోడి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోంది.
జరిగితే జూన్ 16న బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన జరగాలి.. లేదంటే ఆ రోజు పెద్ద గుణపాఠమే అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్.. మరో వారం రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం మూవీ లవర్స్ చూపు మొత్తం 'ఆదిపురుష్' మీదే ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కంప్లీట్ చేసుకుంది.. కాకపోతే షాకింగ్ రన్ టైంతో రాబోతోంది ఆదిపురుష్.
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీ పెళ్లి వేడుకగా జరిగింది. ఈ వివాహ వేడుకకు జబర్దస్త్ కమెడియన్స్, బుల్లితెర నటీనటులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
నాగశౌర్య(Naga Shaurya) చివరగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మూవీలో నటించారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు రంగబలి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జులై 7న ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఫహాద్ ఫాజిల్ నటించిన ధూమం సినిమాకు సంబంధించి తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీ జూన్ 23న ఐదు భాషల్లో విడుదల కానుంది.
బాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ కూడా ఒకరు. సినిమాల్లోనే కాదు, బయట కూడా చాలా స్టైలిష్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంటాడు. అలాంటి కార్తీక్ ఆర్యన్ కి నెటిజన్ల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. దారుణంగా ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం. ఓ పెళ్లికి హాజరైన సమయంలో ఆయన దుస్తులు, రెడీ అయిన విధానం ఏలియన్ లా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు.
టీమిండియా యువ క్రికెటర్ యజువేంద్ర చాహల్ గురించి తెలియనివారు లేరు. ఆయన స్టేడియంలోకి అడుగుపెడితే ఆట అదరగొడతాడనే విషయం తెలుసు. ఐపీఎల్ లోనూ తన సత్తా చాటాడు. కాగా, తాజాగా చాహల్ తన భార్య ధనశ్రీ వర్మ తో కలిసి ఓ బర్త్ డే పార్టీలో సందడి చేశాడు.
చిరు లీక్స్(Chiru Leaks) పేరుతో 'భోళా శంకర్' సినిమా నుంచి మరో సాంగ్‌కు సంబంధించిన వీడియో(Video)ను చిరు షేర్ చేశారు. ఈ పాటలో మూవీలోని నటీనటులంతా ఉన్నారు.
శర్వానంద్ రిసెప్షన్(Hero Sharwanand Reception)కి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Telangana CM KCR)ని శర్వానంద్ కలిశారు. కాసేపు కేసీఆర్‌తో ముచ్చటించారు. సీఎం కేసీఆర్ ను రిసెప్షన్‌కి ఆహ్వానించారు.
ఒకేసారి ఇద్దరు సేమ్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్‌లో శ్రీలీలకు భారీ డిమాండ్ ఉంది. అలాగే సీనియర్ బ్యూటీ పూజా హెగ్డేకు వరుస ఫ్లాపులు వస్తున్నా.. మహేష్‌తో ఛాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు పవన్‌తోను నటించబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవబోతోంది.
కాలింగ్ సహస్త్ర సినిమా హీరో సుధీర్ మాట్లాడుతూ మూడేళ్ల కష్టమే ఈ సినిమా అని, చాలా స్ట్రగుల్స్ దాటి ఈ స్టేజ్‌కు వచ్చినట్లు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సినిమా చేసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అయినా కూడా ఈ స్టార్ డైరెక్టర్‌కు ఒకే ఒక్కడు విలన్‌గా మారాడు. శంకర్‌కే కాదు.. రామ్ చరణ్, కమల్ హాసన్ విలన్ కూడా అతనే.
ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) ఆదిపురుష్ సినిమా(Adipurush Movie)కు సంబంధించి పది వేల టికెట్స్ ను ఫ్రీగా డొనేట్ చేస్తున్నట్లు తెలిపాడు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు ఆదిపురుష్ టికెట్లను డొనేట్ చేస్తున్నట్లు వెల్లడించారు.