నాగశౌర్య(Naga Shaurya) చివరగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మూవీలో నటించారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు రంగబలి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జులై 7న ఈ మూవీ రిలీజ్ కానుంది.
టాలీవుడ్(Tollywood) ఎనర్జిటిక్ హీరో నాగశౌర్య(Naga Shaurya) ‘రంగబలి’ సినిమా(Rangabali Movie) చేస్తున్నాడు. గత ఏడాది ఉగాదికి ఈ సినిమా అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఉగాదికి టైటిల్ ను ప్రకటించారు. ఇటీవలె ఈ మూవీ నుంచి ఓ మాస్ సాంగ్‌ను విడుదల(mass song Release) చేశారు. ఆ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా ‘రంగబలి’ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్(Teaser Release) చేశారు. టీజర్ ను చూస్తే ఇదొక కామెడీ అండ్ యాక్షన్ మూవీ(Comedy action Movie)గా అనిపిస్తోంది.
మెడికల్ షాప్ నడుపుకునే ఓ మిడిల్ క్లాస్ ఫాదర్(Middle class Father), ఏ బాధ్యత లేకుండా జాలిగా తిరిగే కొడుకు మధ్య సాగే సీన్లు కడుపుబ్బా నవ్వించనున్నాయి. హీరో, అతని స్నేహితుడి మధ్య సీన్స్ కూడా బాగా ఆకట్టుకోనున్నాయి. ఈ మూవీలో యుక్తి తరేజా(Yukthi tajeraa) హీరోయిన్ గా నటిస్తోంది. సత్య, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి(Director Pavan Basamshetty) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రంగబలి సినిమాకు పవన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
నాని ‘దసరా’ సినిమా(Dasara Movie)ని తెరకెక్కించిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ ఈ మూవీని రూపొందిస్తోంది. గతంలో నాగశౌర్య(Naga Shaurya) నటించిన ఛలో సినిమా విధంగా ఈ చిత్రం కూడా మాస్ అండ్ కామెడీ బ్యాలన్స్‌గా ఉండనుంది. నాగశౌర్య(Naga Shaurya) చివరగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మూవీలో నటించారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు రంగబలితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జులై 7న ఈ మూవీ రిలీజ్ కానుంది.