»Sharwanand Invited Cm Kcr To The Wedding Reception
Sharwanand: సీఎం కేసీఆర్‌ని పెళ్లి రిసెప్షన్‌కి ఆహ్వానించిన శర్వానంద్
శర్వానంద్ రిసెప్షన్(Hero Sharwanand Reception)కి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Telangana CM KCR)ని శర్వానంద్ కలిశారు. కాసేపు కేసీఆర్‌తో ముచ్చటించారు. సీఎం కేసీఆర్ ను రిసెప్షన్‌కి ఆహ్వానించారు.
టాలీవుడ్(Tollywood) హీరో శర్వానంద్(Hero Sharwanand) పెళ్లి జైపూర్‌లో వేడుకగా జరిగిన సంగతి తెలిసిందే. రక్షిత రెడ్డి(Rakshita Reddy)తో శర్వానంద్ వివాహం(marriage) జరిగింది. ఆయన పెళ్లికి కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు మాత్రమే హాజరయ్యారు. శర్వా బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్(ramcharan) కూడా పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేశారు.
తాజాగా జూన్ 9న శర్వానంద్(Hero Sharwanand) మ్యారేజ్ రిసెప్షన్(Reception) గ్రాండ్‌గా జరగనుంది. దీని కోసం భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. రిసెప్షన్ ఫంక్షన్(Reception Function)లో భాగంగా ఈ కొత్త పెళ్లికొడుకు అతిథులను ఆహ్వానించే పనిలో పడ్డారు. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Telangana CM KCR)ని శర్వానంద్ కలిశారు. కాసేపు కేసీఆర్‌తో ముచ్చటించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్(Videos Viral) అవుతున్నాయి.
శర్వానంద్ రిసెప్షన్(Hero Sharwanand Reception)కి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 38 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న శర్వానంద్(Sharwanand) తర్వాత ఆ వరుసలోకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) చేరాడు. తన ప్రియురాలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripati)ని వరుణ్ తేజ్ పెళ్లాడనున్నాడు. వీరి నిశ్చితార్థ వేడుక(Engagement Function) కూడా జూన్ 9న జరగనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.