ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకూ జరిగిన ఘటనల నేపథ్యంలో యాత్ర2 మూవీ(Yatra2 Movie) సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో రాముడి అవతారంలో కనిపించనున్నారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది.
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పుట్టినరోజు(Birth Day) సందర్భంగా మరో సినిమాను ప్రారంభించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఆ సినిమాను నిర్మించనున్నాయి. బ్లాక్ బస్టర్ సినిమాల డైరెక్టర్ బాబీ(Director Bobby) ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.
పల్లెటూరు అంటే పండగలు, పబ్బాలకు మాత్రమే ఇంటికెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో..పల్లెటూరి కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయనే కథాంశంతో మట్టికథ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి మూడు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
బాలయ్య బర్త్ డే సందర్భంగా మరో కొత్త సినిమాను ప్రారంభించారు. NBK 109 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. డైరెక్టర్ బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.
టాలీవుడ్ హీరీయిన్ సమంత కెరీర్ లో దూసుకుపోతోంది. ది ఫ్యామిలీ మేన్ సిరీస్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్ తో సమంత హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు రాబోతున్న మరో సిరీస్ ‘‘సిటాడెల్’’ తో మరింత అలరించేందుకు కృషి చేస్తోంది.
టాలెంటెడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఆయన వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరోసారి తనకు అచ్చొచ్చిన కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్ జానర్‌లో ‘రంగబలి’ సినిమాతో వస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. ఇక, ఈ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ఈ ఇద్దరు స్టార్స్ పై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా చూసిన హాలీవుడ్ నటుడు క్రిస్ హేమ్స్‌వర్త్ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్, చెర్రీలతో కలిసి పనిచేయడం గర్వకారణమన్నాడు.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. ఎంతో ఖరీదైన మద్యం బాటిళ్లు, నగదు చోరీ గురైందని ఆయన సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జనతా గ్యారేజ్, దేవరాయ, అత్తిలి సత్తిబాబు వంటి సినిమాల్లో నటించిన విదిషా శ్రీవాస్తవ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె తన బేబీ బంప్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవికాస్తా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో పలకరించారు. తన తదుపరి చిత్రం 'గుంటూరు కారం' త్రివిక్రమ్‌తో చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది. మహేష్ బాబు తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో మోస్ట్ వాంటేడ్ హీరోగా ఉన్న సిద్దార్థ్.. ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. అయినా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తునే ఉన్నాడు. తాజాగా 'టక్కర్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్య్వూలో.. ఒక పెద్దావిడను చూడగానే బోరున ఏడ్చేశాడు సిద్ధార్థ్. మరి ఆమె ఎవరు? ఈ హీరో ఎందుకు ఏడ్చాడు?
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక నాగబాబు నివాసంలో ప్రారంభమైంది. మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వారు ఒక్కొక్కరే ఈ వేడుకకు హాజరవుతూ వస్తున్నారు. నిశ్చితార్థానికి కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు.
భారీ సంఖ్యలో తిమింగలాలను చంపుతున్న వీడియోను యాంకర్ రష్మీ షేర్ చేశారు. యానిమల్ లవర్ అయిన రష్మీ ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షసులు మనుషుల రూపంలోనే మనమధ్యే ఉంటారని ట్వీట్ చేశారు.
టాలీవుడ్ ట్రెండింగ్ వార్ ఏదంటే.. అనసూయ, విజయ్ దేవరకొండదే అని చెప్పొచ్చు. గత కొంత కాలంగా రౌడీ ఫ్యాన్స్, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరుగుతునే ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా.. ఇండైరెక్ట్‌గా అనసూయ ఏదో ఒక పోస్ట్ చేయడం.. దానికి కౌంటర్‌గా రౌడీ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం కామన్ అయిపోయింది. అయితే తాజాగా ఇవన్నీ ఆపేద్దామనుకుంటున్నానని చెప్పి షాక్ ఇచ్చింది అనసూయ.