టాలెంటెడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఆయన వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరోసారి తనకు అచ్చొచ్చిన కామెడీ, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జానర్లో ‘రంగబలి’ సినిమాతో వస్తున్నాడు.
అలాగే టీజర్లో శౌర్య(Naga shaurya) చెప్పిన “మా డెడికేషన్ చూస్తే మీకు జ్వరమొచ్చేస్తది”.. డైలాగ్ కూడా మంచి టైమింగ్‌లో పడింది. నాగ శౌర్య తండ్రి పాత్రలో గోపరాజు రమణ నటించారు. లవ్ స్టోరీ ఫేమ్ పవన్ సీహెచ్.. ఈ రంగబలి మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం శ్రీ లక్ష్మి వేంకటేశ్వర్ సినిమాస్ పతాకంపై వస్తోంది. దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. కార్తిక శ్రీనివాస్ ఎడిటర్‌గా ఉన్నాడు. రంగబలి సినిమా(Rangabali Movie) జూలై 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.