పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీ ఫైర్ అయ్యాడు. మీడియా ముఖంగా ఆయన పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాపుల మధ్య చిచ్చుపెట్టి పవన్ గెలవలేడని, ముద్రగడకు ఆయన క్షమాపణలు చెప్పాలని అన్నారు.
రాకేష్ మాస్టర్ తనయుడు చరణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. తన తండ్రిని యూట్యూబ్ ఛానెల్స్ తమ స్వార్థానికి వాడుకున్నాయని, ఇకనైనా తన కుటుంబాన్ని, తనను అల్లరి పాలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ కష్టాల గురించి వీడియోలు తీసి, తమను ఇబ్బందుల పాలు చేయొద్దని తెలిపాడు.
టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ నటించిన స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదలకు సిద్ధమైంది. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాల చుట్టూ ఈ మూవీ కథాంశం సాగుతుంది. తాజాగా స్పై మూవీ ట్రైలర్(SPY Trailer) లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ‘గర్రి బిహెచ్’ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నిఖిల్‌కు జోడీగా ఈ మూవీలో తమిళ్ నటి ఐశ్వర్య మీనన్ నటిస్తోంది.
దళపతి విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా లియో. తాజాగా విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
హీరో ప్రియదర్శి చేతుల మీదుగా 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ 'ఆహా' వేదిక ఈ వెబ్ సిరీస్ జూన్ 30వ తేది నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా దేవర. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమా నుంచి తాజాగా ఓ కీలక అప్ డేట్ బయటకు వచ్చింది.
జూన్ 16న చాలా గ్రాండ్‌గా ఆదిపురుష్ సినిమా థియేటర్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయినా కూడా ప్రభాస్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అసలు ప్రజెంట్ ప్రభాస్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అనేది ఆసక్తిరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ విల్లాతో పాటు.. దాని రెంట్ మరియు డార్లింగ్ ఎక్కడున్నాడో కూడా తెలిసిపోయింది.
తాజాగా మనోజ్‌మరో పోస్ట్ పెట్టాడు. భార్య మౌనిక యోగా ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
స్పై మూవీ ట్రైలర్(SPY Trailer) లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లోని అల్లుఅర్జున్ మల్టీప్లెక్స్ ఏఏఏ సినిమాస్ లో జరిగింది. ఈ మూవీలో రానా కీలక పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్ లో విజువల్స్, డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.
న్యాచురల్ స్టార్ నాని ఇటీవలె దసరా సినిమాతో మాసివ్ పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడిని పరిచయం చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో 30వ సినిమా చేస్తున్నాడు నాని. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
జూన్ 24న భోళా శంకర్ నుంచి జిగేల్మనిపించేలా టీజర్ రానుందని చిత్రబృందం వెల్లడించింది.
ఓ వైపు ఆదిపురుష్ పై భారీగా విమర్శలు వస్తున్నా.. మరో వైపు థియేటర్లో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. అంతేకాదు ఈ సినిమా కోసం వేలకు వేల టికెట్స్‌ని బుక్ చేసుకొని.. పేదలకు, పిల్లలకు సినిమా చూపిస్తున్నారు చాలామంది సినీ సెలబ్రిటీస్. అయినా వివాదాలు అగడం లేదు. తాజాగా అలనాటి లక్ష్మణుడు ఆదిపురుష్ మరోసారి మండి పడ్డారు.
కోనసీమ జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సాగుతోంది. యాత్రలో భాగంగా నేడు అమలాపురంలో బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కన్నడ సూపర్ స్టార్ యష్ కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీతో ఆయన ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయారు. అయితే, ఆ మూవీ తర్వాత ఆయన మళ్లీ కొత్త సినిమా ఏమీ చేయలేదు. దీంతో, ఆయన తన కొత్త సినిమా గురించి ఎప్పుడు ప్రకటిస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన కొత్త మూవీ ఆలస్యం కావడానికి గల కారణాన్ని తెలియజేశారు.
తెలుగులో హాట్ బ్యూటీ పూజా హెగ్డే కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్టే. ప్రస్తుతం అమ్మడి చేతిలో మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి పూజా తప్పుకున్నట్టు దాదాపుగా కన్ఫర్మేషన్ వచ్చేసినట్టే. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో ఒకటి.. బాలీవుడ్ పైనే ఫోకస్ చేసినట్టుగా ఉంది.