పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ మధ్య మంచి రాపో ఉంది. ఈ ఇద్దరు కలిసి గతంలో 'గోపాల గోపాల' సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పవన్ దేవుడిగానటించగా.. వెంకీ నాస్తికుడిగా నటించాడు. అయితే ఈ ఇద్దరు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది.
హీరో జగపతి బాబు, నిర్మలా రామన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం రుద్రంగి. ఈ మూవీని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తున్నారు. జులై 7న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దర్శకధీరుడు రాజమౌళి అంటే.. ఓ బ్రాండ్‌గా మారిపోయింది. రాజమౌళి అంటే తెలియని వారు లేరనే చెప్పాలి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు జక్కన్న క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు సినిమా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు. అందుకే పబ్లిక్ మీటింగ్స్‌లో పెద్దగా కనిపించడం లేదు. కానీ రాజమౌళి ఓల్డ్ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. అందులో జక్కన్న చేసిన కొన్ని ...
పవన్ వారసుడు అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తే.. ఓ రేంజ్‌లో వెల్కమ్ చెప్పాలని కలలు కంటున్నారు మెగాభిమానులు. కానీ పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ మాత్రం.. అకీరా నందన్ హీరో ఎంట్రీ గురించి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే అకీరా నందన్ లేటెస్ట్ వీడియో చూసిన తర్వాత.. హీరోగా రెడీ అవుతున్నాడని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. తాజాగా రేణు దేశాయ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తమిళ హీరో దళపతి విజయ్‌పై తమిళనాడులో కేసు నమోదైంది. ఇటీవలె ఆయన సినిమా లియో నుంచి వచ్చిన నా రెడీ అనే లిరికల్ సాంగ్‌లో ఎక్కువగా సిగరెట్లు తాగుతూ కనిపించాడు. దీంతో ఆయన మద్యం, పొగాకు ప్రోత్సహించినందుకు విజయ్ పై ఓ వ్యక్తి కేసు పెట్టాడు.
జనసేన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనపై చేయి పడినా, రాయి పడినా ఊరుకునేది లేదని, తన్ని తగలేస్తానని అన్నారు.
Mistake మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం.
శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సామజవరగమన. ఈ మూవీ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
కేపీ చౌదరి డ్రగ్స్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని నటి జ్యోతి, సురేఖా వాణిలు వీడియోలు రిలీజ్ చేశారు. తమను ఈ కేసులోకి లాగొద్దని తెలిపారు.
హీరోయిన్ డింపుల్ హయతితో ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి పూజలు చేయించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సుభాస్ చంద్రబోస్ మరణం వెనక ఉన్న రహస్యం చుట్టూ తెలిపే కథాంశంతో స్పై మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
సినీ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తాజాగా తాను కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ లో పాల్గొంటున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు గుబులు రేపుతోంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ అవ్వడంతో పోలీసులు ఆయన కాంటాక్ట్స్ లిస్ట్ పరిశీలించారు. తాను 12 మందికి కొకైన్ అమ్మినట్లు కేపీ చౌదరి అంగీకరించడంతో పోలీసులు ఆ 12 మందికి నోటీసులు పంపారు.
'తొలిప్రేమ' విడుదలై ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 4kలో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. జూన్ 30వ తేదిన 300కి పైగా థియేటర్లలో ఈ మూవీ భారీగా రీ రిలీజ్ కానుంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ రిలీజ్ చేశారు.
రామ్ చరణ్-ఉపాసన దంపతులపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి