హీరో జగపతి బాబు, నిర్మలా రామన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం రుద్రంగి. ఈ మూవీని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తున్నారు. జులై 7న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
విలక్షణ నటుడు జగపతి బాబు(Jagapati Babu) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రుద్రంగి (Rudrangi Movie). ఈ మూవీలో విమలా రామన్(Vimala Raman), మమతా మోహన్ దాస్(Mamatha Mohan Dass)లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ(Action Drama Movie) తెరకెక్కుతోంది. చిత్ర యూనిట్ ఈ మూవీ ట్రైలర్ ను విడుదల(Trailer Release) చేశారు. ఈ మూవీలో జగపతిబాబు దొర పాత్రలో కనిపించనున్నట్లు ట్రైలర్, పోస్టర్స్ తెలుపుతున్నాయి.
బలుపుకి బతుకుకి జరిగిన పోరాటం, గెలిచిన త్యాగం నిలిచిన ధర్మం ఈ రుద్రంగి #RudrangiTrailer Out Now :
ఓ క్రూరమైన పరిపాలన చేసే దొర వల్ల, అతని దౌర్జన్యాల వల్ల ప్రజలు పేదవారై ఆకలితో అలమటిస్తారు. ఆ తర్వాత దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతుంది. ఈ విషయాలను తెలియజేస్తూ కొన్ని సీన్స్(Movie Scenes) కట్ చేసి ‘రుద్రంగి’ ట్రైలర్(Rudrangi Trailer)ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్(Action Scenes) అందర్నీ ఆకట్టుకుంటాయని మేకర్స్ తెలిపారు.
రుద్రంగి మూవీ ట్రైలర్:
రుద్రంగి మూవీ(Rudrangi Movie)కి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(Mla Rasamai Balakishan) నిర్మిస్తున్నాయి. ఇందులో కాలకేయ ప్రభాకర్, ఆశిష్ గాంధీ, ఆశిస్ నందా, దివి వంటివారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 7వ తేదిన థియేటర్లలో ఈ మూవీ విడుదల(Movie Release) కానుంది.