ఓ వైపు ఆదిపురుష్ పై భారీగా విమర్శలు వస్తున్నా.. మరో వైపు థియేటర్లో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. అంతేకాదు ఈ సినిమా కోసం వేలకు వేల టికెట్స్ని బుక్ చేసుకొని.. పేదలకు, పిల్లలకు సినిమా చూపిస్తున్నారు చాలామంది సినీ సెలబ్రిటీస్. అయినా వివాదాలు అగడం లేదు. తాజాగా అలనాటి లక్ష్మణుడు ఆదిపురుష్ మరోసారి మండి పడ్డారు.
జూన్ 16న గ్రాండ్గా థియేటర్లోకి వచ్చిన ఆదిపురుష్(Adipurush).. ఆరు రోజుల్లో ఇప్పటి వరకు 410 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కానీ ఈ సినిమా పై రోజుకో కొత్త వివాదం తెరపైకి వస్తునే ఉన్నాయి. ఇది అసలు రామాయణమే కాదు అని కొందరు అంటుంటే, అన్ని కోట్లు పెట్టి ఇలాంటి సినిమానా చేసేది.. అంటూ విమర్శిస్తున్నారు. ఇండియా ఫస్ట్ సూపర్ హీరో శక్తిమాన్ ముఖేష్ ఖన్నా కూడా ఆదిపురుష్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. రామాయణం కామెడీ ఎలా అవుతుంది. రామాయణం ఆధారంగా తీసిన చెత్త డ్రామాలో ఇది ఒకటి, రామాయణంని అపహాస్యం చెయ్యడానికే ఈ సినిమా తీశారంటూ మండిపడ్డాడు. అసలు రావణుడి పాత్రకి సైఫ్ అలీ ఖాన్ ఎలా దొరికాడు నీకు.. రావణుడు ఒక స్మగ్లర్లా కనిపిస్తున్నాడు అంటూ.. ఓం రౌత్ పై విరుచుకుపడ్డాడు.
అలాగే రామాయణం సీరియల్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహ్రీ కూడా ‘ఆదిపురుష్’ (Adipurush)పై మరోసారి కామెంట్స్ చేశాడు. గతంలో తన కోపాన్ని మొత్తం చూపిస్తూ సునీల్ లహ్రీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి స్పందించాడు. ‘నేను సినిమాకు వెళ్లినప్పుడు నా చుట్టూ ఉన్న ప్రేక్షకులను గమనించా. నా ముందు కూర్చున్న ఇద్దరు మహిళలు సినిమా మధ్యలో వెళ్లిపోవాలనుకున్నారు. కానీ అందులో విజువల్స్ బాగున్నాయి కాబట్టి చూద్దామని ఉండిపోయారు. మరో వ్యక్తి ‘రామాయణం పేరుతో ఏం చూపిస్తున్నారంటూ’ కామెంట్ చేశాడు. ఇక నేను కూడా సినిమా చూశాక తీవ్ర నిరాశకు గురయ్యా. కానీ, సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగున్నాయి.
అవి అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు ప్రేక్షకులు చాలా అంచనాలతో వస్తారు. వాళ్ల అంచనాలను అందుకోవడంలో చిత్రబృందం విఫలమైందని నా అభిప్రాయం. రామాయణానికి ఆధునికత జోడించామన్నారు. కానీ చిత్రంలోని పాత్రలకు టాటూలు వేయడం లేదా హైయిర్ స్టయిల్ మార్చడం వల్ల ఆధునికత రాదు.. అనే విషయాన్ని గమనించాలి. అలాగే కొన్ని సంభాషణల్లో ముఖ్యంగా హనుమంతుడి సన్నివేశాల్లో వాడిన భాషలో మార్పు చేసి ఉంటే బాగుండేది’.. అంటూ సునీల్ లహ్రీ అసహనం వ్యక్తం చేశారు.