Jr.NTR : ప్రస్తుతం టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌దే ఫస్ట్ ప్లేస్ అంటున్నాయి కొన్ని సర్వేలు. ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడంతో.. చరణ్, తారక్ గ్లోబల్ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఆస్కార్ సమయంలో హాలీవుడ్ మీడియా సైతం ఈ ఇద్దరినే ఫోకస్ చేయడం విశేషం.
ప్రస్తుతం టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌దే ఫస్ట్ ప్లేస్ అంటున్నాయి కొన్ని సర్వేలు. ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడంతో.. చరణ్, తారక్ గ్లోబల్ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఆస్కార్ సమయంలో హాలీవుడ్ మీడియా సైతం ఈ ఇద్దరినే ఫోకస్ చేయడం విశేషం. ఇద్దరు కూడా ఆస్కార్ ఈవెంట్లో హైలెట్‌గా నిలిచారు. అయితే 95వ అకాడమీ అవార్డుల వేడుకలో ఎన్టీఆర్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఆస్కార్ అవార్డుల వేడుక సందర్భంగా సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో టాప్ మేల్ మెన్షన్స్‌లో జాబితాలో.. ఎన్టీఆర్ నెంబర్ 1 స్థానంలో నిలిచినట్లు.. సోషల్ మీడియాను విశ్లేషించే నెట్‌బేస్ క్విడ్ తెలిపింది. తారక్ తర్వాత స్థానంలో రామ్‌చరణ్ నిలిచాడు. ఆ తర్వాత కె హుయ్ ఖ్యాన్, బ్రెండన్ ఫ్రేజర్, అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్‌లు ఉన్నారు. ఇలాంటి హాలీవుడ్ టాప్ స్టార్స్‌ను వెనక్కి నెట్టి.. ఎన్టీఆర్ అగ్రస్థానంలో ఉండటం గర్వించదగ్గ విషయం. అలాగే అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగానూ ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్లో స్టార్స్‌లో అత్యంత ప్రభావ వంతం అయిన హీరోల్లో.. టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలోను.. ఎన్టీఆర్ నెంబర్ వన్ స్థానంలో ఉండటం విశేషం. మార్చి 1 నుంచి 12 మధ్య నిర్వహించిన సర్వేలో ఎక్కువ ఆదరణ ఉన్న సెలబ్రిటీగా తారక్ నిలిచాడు.
ఆ తర్వాత రామ్ చరణ్ రెండో స్థానంలో ఉండగా.. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ నిలిచారు. మొత్తంగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన హీరోలుగా.. మొదటి రెండు స్థానాల్లో తారక్, చరణ్ ఉండడం విశేషం. ఇక ఇప్పుడు నాటు నాటు పాటకి ఆస్కార్ కూడా రావడంతో ఇద్దరికీ మరింత పాపులారిటీ వచ్చేసింది.