సినీ ఇండస్ట్రీలో హీరోగా చెలామణి అవుతూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఒకరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేసిన నవీన్ రెడ్డి మోసాలకు పాల్పడ్డాడు. కంపెనీలోని సహ డైరెక్టర్లకు తెలీయకుండా కంపెనీ ఆస్తులను తాకట్టు పెట్టాడు. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో రూ.55 కోట్లు మోసం చేసినట్లుగా నవీన్ రెడ్డిపై ఎస్‌స్క్వేర్ కంపెనీ డైరెక్టర్లు ఫిర్యాదు చేశారు. దీంతో సినీ హీరో అట్లూరి నవీన్ రెడ్డిపై కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు నవీన్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. మోసం చేసిన డబ్బులతో నవీన్ జల్సాలు చేశాడని, తానే హీరోగా నోబడీ అనే సినిమా చేసినట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలానికి చెందిన నవీన్ రెడ్డిపై గతంలో కూడా పలు బైక్ దొంగతనం కేసులు ఉన్నాయి. నవీన్ రెడ్డిని పోలీసులు త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నారు.