చిన్న సినిమానా? పెద్ద సినిమా? అనేది పక్కన పెడితే.. మహేష్ బాబు, రాజమౌళికి సినిమా నచ్చితే చాలు.. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో వీళ్లు ముందు వరుసలో ఉంటారు. మేమ్ ఫేమస్ విషయంలోను ఇదే చేశారు మహేష్, రాజమౌళి.. కానీ దీని వెనక లెక్క వేరే ఉందనే కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
పోయిన వారం రిలీజ్ అయిన సినిమాల్లో ‘మేమ్ ఫేమస్'(Mem Famous) అనే సినిమాకు భారీ పబ్లిసిటీ జరిగింది. ఛాయ్ బిస్కట్ నుంచి చిన్న సినిమాగా వచ్చిన మేమ్ ఫేమస్‌లో.. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించడమే కాకుండా.. డైరెక్షన్ కూడా చేశాడు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు మహేష్ బాబు చేసిన ట్వీట్ మరింత హైప్ క్రియేట్ చేసింది. దాంతో మూడు రోజుల్లోనే మూడు కోట్ల వసూళ్లను రాబట్టింది మేమ్ ఫేమస్. అయితే ఇది మేకర్స్ ఊహించిన దానికంటే తక్కువేనని అంటున్నారు. కావాలనే తమ సినిమాకు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశారని.. పంచాయితీ పేరుతో ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు.
బుక్ మై షోలో పనిగట్టుకొని మరీ.. కావాలని తక్కువ రేటింగ్ ఇచ్చారని హీరో చెప్పుకొచ్చాడు. అందుకే ఈ పంచాయితీ పెట్టామని అన్నారు. అయితే రిలీజ్‌కు ముందు మహేష్ బాబు ఈ సినిమాను మెచ్చుకుంటే.. రిలీజ్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు. ‘చాలా కాలం తర్వాత థియేటర్లో సినిమాని ఫుల్లుగా ఎంజాయ్ చేశా.. నటుడిగా, దర్శకుడిగా సుమంత్‌కి మంచి భవిష్యత్తు ఉంది.. యూత్‌ను ఎంకరేజ్ చెయ్యాలె.. ధమ్ ధమ్ చెయ్యొద్దు’ అంటూ ట్వీట్ చేశాడు. దాంతో మేమ్ ఫేమస్ మరింత ఫేమస్ అయిపోయింది.
కానీ ఇప్పుడు రాజమౌళికి పై చేస్తున్న కొన్ని కామెంట్స్ వైరల్‌గా మారాయి. రాజమౌళి ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి డబ్బులు తీసుకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జక్కన్నతో పాటు మహేష్ బాబుది కూడా పెయిడ్ రివ్యూలంటూ.. రకారకాల కామెంట్స్ చేస్తున్నారు. అయినా మహేష్, రజామౌళి రేంజ్ ఏంటి? చిన్న సినిమాకు పెయిడ్ ప్రమోషన్స్ ఏంటి? సిల్లీ కామెంట్స్ కాకపోతే!