Chiru : అర్జున్ రెడ్డితో సంచలన విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అదే సినిమాను బాలీవుడ్లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి ఒకే ఒక్క సినిమా వచ్చింది.
అర్జున్ రెడ్డితో సంచలన విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అదే సినిమాను బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి ఒకే ఒక్క సినిమా వచ్చింది. కానీ నెక్స్ట్ లైనప్ చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే. ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఎప్పుడో ‘స్పిరిట్’ అనే ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. యానిమల్ అయిపోగానే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది. కానీ ఈ లోపే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించాడు. బన్నీ ‘పుష్ప2’, ప్రభాస్ ‘స్పిరిట్’ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది. కానీ అప్పుడే మెగాస్టార్‌ను ఒప్పించేందుకు రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగా. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తనకు సినిమా చేయాలని ఉందని.. ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాను.. ఈ విషయంలో తాను పక్కా ప్లానింగ్‌తో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇక సందీప్ రెడ్డి చెప్పాడంటే.. ఖచ్చితంగా ఈ కాంబో ఫిక్స్ అయిపోయినట్టే. యంగ్ టాలెంట్‌తో సినిమాలు చేయడంలో మెగాస్టార్ ముందు వరుసలో ఉంటారు. అలాంటిది సందీప్ రెడ్డితో సినిమా అంటే.. డౌటే లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండే అవకాశాలు తక్కువ. కానీ ప్రభాస్, బన్నీ సినిమాల తర్వాత మెగాస్టార్‌తో సినిమా ఉండడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు. అయితే యంగ్ హీరోలను రా అండ్ రస్టిక్‌గా చూపించే సందీప్.. మెగాస్టార్‌ను ఎలా చూపిస్తాడనేది.. ఆసక్తికరంగా మారింది. మరి ఈ ‘రా’ డైరెక్టర్‌తో మెగాస్టార్ సినిమా ఎప్పుడు ఉంటుందో చూడాలి.