Hero Ajith Kumar: స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం
సుబ్రమణ్యం(Subramanyam) కేరళలోని పాలక్కాడ్ కు చెందిన మలయాళీ కుటుంబం. ఆయన భార్య మోహినీ. ఈ దంపతులకు అజిత్ కుమార్(Ajith Kumar)తో పాటుగా అనుప్ కుమార్, అనిల్ కుమార్ కుమారులు ఉన్నారు. ప్రస్తుతం అజిత్, ఆయన భార్య షాలిని, పిల్లలతో కలిసి యూరప్ టూర్ లో ఉన్నారు. తండ్రి మరణవార్తతో అజిత్ ఫ్యామిలీ చెన్నై పయనమైంది.
కోలీవుడ్(Kollywood) స్టార్ హీరో అజిత్(Ajith) తండ్రి సుబ్రమణ్యం కన్నుమూశారు. 84 ఏళ్ల సుబ్రమణ్యం(Subramanyam) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం అజిత్ తండ్రి మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. అనారోగ్య సమస్యల(Health Problems)తో చికిత్స తీసుకుంటున్న సుబ్రమణ్యం చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ ఘటనతో పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అజిత్(Ajith) కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.
సుబ్రమణ్యం(Subramanyam) కేరళలోని పాలక్కాడ్ కు చెందిన మలయాళీ కుటుంబం. ఆయన భార్య మోహినీ. ఈ దంపతులకు అజిత్ కుమార్(Ajith Kumar)తో పాటుగా అనుప్ కుమార్, అనిల్ కుమార్ కుమారులు ఉన్నారు. ప్రస్తుతం అజిత్, ఆయన భార్య షాలిని, పిల్లలతో కలిసి యూరప్ టూర్ లో ఉన్నారు. తండ్రి మరణవార్తతో అజిత్ ఫ్యామిలీ చెన్నై పయనమైంది.
శుక్రవారం సాయంత్రం చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో అజిత్(Ajith) తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుబ్రమణ్యం పక్షవాతంతో పాటు పలు అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. అందుకు చికిత్స తీసుకుంటూ ఉండగా శుక్రవారం ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.