తమిళ హీరో జయం రవి(Jayam Ravi) తన కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. కోలీవుడ్(Kollywood) సినీ ఇండస్ట్రీ ప్రముఖ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న జయం రవి తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్నాడు. తన తదుపరి చిత్రం ‘జీని’ని బుధవారం చెన్నైలో ప్రారంభించారు. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మూవీని వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డాక్టర్ ఐసరి కె.గణేష్ రూపొందిస్తున్నారు.
దర్శకుడు అర్జునన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి(kriti shetty), కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటిస్తుండగా దేవయాని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీకి మహేష్ ముత్తుస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్(A.R.Rehman) మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇప్పటి వరకూ పలు హాలీవుడ్(Hollywood), ఇంటర్నేషనల్ మూవీస్‌కు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన యానిక్ బెన్ ఈ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలను సమకూర్చారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్లో వస్తోన్న 25వ సినిమా కావడంతో దీనిని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.