Hidimbha Movie Trailer: ఆసక్తికరంగా ‘హిడింబ’ ట్రైలర్
ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్విన్ బాబు హీరోగా 'హిడింబ' సినిమా(Hidimbha Movie) రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (trailer)ను సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam tej) రిలీజ్ చేశారు.
యాంకర్ ఓంకార్(Omkar) తమ్ముడు అశ్విన్ బాబు(Aswin Babu) మరో వైవిధ్యభరిత కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్విన్ బాబు హీరోగా ‘హిడింబ’ సినిమా(Hidimbha Movie) రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (trailer)ను సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam tej) రిలీజ్ చేశారు. 1908లో బంగాళాఖాతంలో బ్రిటీష్ వారు భారతీయులపై జరిపిన సంఘటనల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. అలాగే హైదరాబాద్ నగరంలో మిస్సింగ్ కేసులను అటాచ్ చేస్తూ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ (Crime suspence thriller)గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘హిడింబ’ ట్రైలర్:
ఎరుపు రంగును టార్గెట్ చేసే ఓ కిడ్నాపర్ ను పట్టుకోవడానికి ఓ పోలీస్ ఆఫీసర్ పడిన శ్రమను మూవీలో చూపించనున్నట్లు ట్రైలర్ (Trailer)ను చూస్తేనే తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ నందితా శ్వేత(Nandita swetha) కూడా ఓ పోలీసు అధికారిగా నటించింది. హీరో అశ్విన్ బాబు(Aswin Babu) మాట్లాడుతూ..తన కెరీర్ లోనే హిడింబ సినిమా అద్భుత విజయం సాధిస్తుందన్నారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందన్నారు.
ట్రైలర్ (trailer) లాంచ్ ఈవెంట్లో హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..తనకు అశ్విన్ (Aswin Babu)కు క్రికెట్ తో పరిచయం ఏర్పడిందన్నారు. ఈ సినిమా పెద్ద విజయం కావాలని ఆశించారు. ట్రైలర్ (trailer)ను చూస్తుంటే గూస్ బంప్స్ తెప్పించిందన్నారు. దర్శకుడు అనిల్ సుంకర ఈ సినిమాను ప్రజెంట్ చేయడం ఆనందంగా ఉందన్నారు.