టాలీవుడ్ హీరోయిన్ గా పూర్ణ ఎంతో పాపులర్ అయ్యింది. ఈమె హీరోయిన్ గా కంటే పలు షోలకు న్యాయనిర్ణేతగా చేసి ఫేమస్ అయ్యింది. తెలుగులో ‘శ్రీ మహాలక్ష్మి’, అవును, సీమటపాకాయ్, అఖండ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బుల్లితెరపై ఢీషోకు న్యాయనిర్ణేతగా చేసింది. గత ఏడాది అక్టోబర్ లో దుబాయ్ కు చెందిన బిజినెస్ మ్యాన్ తో పూర్ణకు వివాహం అయ్యింది. పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్. ఈమె పెళ్లి అయిన కొద్ది రోజులకే తాను తల్లికాబోతున్నానని తెలిపింది.
తాజాగా ఆదివారం పూర్ణ సీమంతం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం తన సీమంతానికి సంబంధించిన వీడియోను పూర్ణ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రిలీజ్ చేసింది. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ ఆలీని పూర్ణ వివాహమాడింది. డిసెంబర్ 31న తాను తల్లికాబోతున్నానని ప్రకటించింది. ప్రస్తుతం పూర్ణ సీమంతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.