‘Guntur Karam’ Heroines: పవర్ స్టార్ కోసం ‘గుంటూరు కారం’ హీరోయిన్లు!?
ఒకేసారి ఇద్దరు సేమ్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీలకు భారీ డిమాండ్ ఉంది. అలాగే సీనియర్ బ్యూటీ పూజా హెగ్డేకు వరుస ఫ్లాపులు వస్తున్నా.. మహేష్‌తో ఛాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు పవన్తోను నటించబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవబోతోంది.
ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం(Director Trivikram)లో ‘గుంటూరు కారం’ అనే సినిమా(Guntur Karam Movie) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్లుగా సీనియర్ బ్యూటీ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నారు. ఈ ఇద్దరిలో మెయిన్ హీరోయిన్ ఎవరనేది? సినిమా రిలీజ్ అయ్యే వరకు గానీ తెలియదు. కానీ ఇద్దరిది కీ రోల్ అని సమాచారం. అయితే డ్యాన్స్ విషయంలో మాత్రం శ్రీలీల డామినేషన్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్ల కాంబినేషన్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
హరీష్ శంకర్ డైరెక్షన్లో(Director Harish Shankar) పవన్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరెకక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే పవన్, శ్రీలీల పై కొన్ని సీన్స్ షూట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే కూడా జాయిన్ అవబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ ‘తేరీ’ రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. తేరీలో విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. దాంతో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్‌లో.. పూజా హెగ్డేను కూడా ఫైనల్ చేసినట్టు టాక్. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇకపోతే.. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబో నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ఓ రేంజ్లో ఉంది. మరి ఈసారి గబ్బర్ సింగ్ కాంబో ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.