Prabhas : ‘ఆదిపురుష్’ ఎంత పని చేశాడు.. ఫ్యాన్స్ అప్సెట్!
Prabhas : ఈ న్యూస్ వింటే.. అరె ఆదిపురుష్ ఎంత పని చేశాడు? అని అనిపించక మానదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ప్రభాస్‌కు ఒక సాలిడ్ హిట్ పడాలని కోరుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అలా జరగాలంటే.. ప్రభాస్ అప్ కమింగ్ సినిమాలు థియేర్లోకి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఈ న్యూస్ వింటే.. అరె ఆదిపురుష్ ఎంత పని చేశాడు? అని అనిపించక మానదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ప్రభాస్‌కు ఒక సాలిడ్ హిట్ పడాలని కోరుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అలా జరగాలంటే.. ప్రభాస్ అప్ కమింగ్ సినిమాలు థియేర్లోకి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ముందుగా ప్రభాస్ నుంచి ఆదిపురుష్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు భారీగా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ టీజర్ చూసిన తర్వాత.. అవసరమైతే ఓం రౌత్ ఈ సినిమాను ఆపేస్తే బెటర్.. అనే కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఓం రౌత్ మాత్రం ఫ్యాన్స్‌ను మెప్పించే వరకు తగ్గేదేలే అంటున్నాడు. ప్రభాస్ కూడా ఓం రౌత్‌కి అండగా నిలబడుతున్నాడు. ఆదిపురుష్ పై హైప్ తగ్గిపోయిన తర్వాత.. ప్రభాస్ నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కానీ అలా జరిగితే ఆదిపురుష్ పై ఉన్న కాస్తంత బజ్ కూడా తగ్గిపోతుందని భావిస్తున్నారట. అందుకే ఆదిపురుష్ రిలీజ్ అయ్యే వరకు మిగతా సినిమాల అప్డేట్స్ ఇవ్వొద్దని మేకర్స్‌కు సూచించాడట ప్రభాస్. అందరి దృష్టి ‘ఆదిపురుష్’ పైనే ఉండాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాల అప్డేట్స్ అన్నీ ఆగిపోయినట్టే. ఈ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ రావాలన్నా.. ఆదిపురుష్ రిలీజ్ తర్వాతే అంటున్నారు. ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏదేమైనా.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆదిపురుష్ వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ అంటూ.. అప్సెట్ అవుతున్నారు. మరి ఆదిపురుష్ ఏం చేస్తాడో చూడాలి.