హీరో విశ్వక్ సేన్(Hero Viswaksen) చేతుల మీదుగా 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో'(Annapoorna Photo Studio Movie) నుంచి నాలుగో సాంగ్ రిలీజ్ అయ్యింది. 'ఓ ముద్దుగుమ్మ' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్(Romantic Song) అందర్నీ ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్(Tollywood)లో ‘పెళ్లిచూపులు’ సినిమా(Pelli chupulu Movie) హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ సినిమా(Annapoorna Photo Studio Movie) తెరకెక్కుతోంది. ‘ఇచ్చట అందమైన ఫోటోస్ తీయబడును’ అనే క్యాప్షన్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. చెందు ముద్దు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ’30 వెడ్స్ 21′ వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావు హీరోగా, లావణ్య హీరోయిన్గా నటిస్తోంది. ఈ మధ్యనే ఈ మూవీ నుంచి మోషన్ పోస్టర్ విడుదలైంది.
‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ సాంగ్:
తాజాగా హీరో విశ్వక్ సేన్(Hero Viswaksen) చేతుల మీదుగా ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో'(Annapoorna Photo Studio Movie) నుంచి నాలుగో సాంగ్ రిలీజ్ అయ్యింది. ‘ఓ ముద్దుగుమ్మ’ అంటూ సాగే రొమాంటిక్ పాట(Romantic Song) ఆకట్టుకుంటోంది. శ్రేష్ఠ అందించిన లిరిక్స్ చాలా బావున్నాయి. ఈ మూవీకి ప్రిన్స్ హెన్రీ మ్యూజిక్ అందించారు. లిప్సిక అద్భుతంగా పాడింది.
విశ్వక్ సేన్(Viswaksen) మాట్లాడుతూ.. చైతన్యతో కలిసి సినిమా చెయ్యలేదు కానీ ‘ముఖ చిత్రం’ సినిమా నుంచి పరిచయమయ్యాడన్నారు. ఈ సినిమా పాటని వింటుంటే చాలా హాయిగా అనిపించిందన్నారు. సాంగ్ అదిరిపోయిందని, ముద్దుగుమ్మ పాట చాలా బాగుందన్నారు. మూవీ యూనిట్ కి గుడ్ లక్ చెప్పారు. హీరో చైతన్య రావు(Chaitanya Rao) మాట్లాడుతూ..మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపాడు. ప్రేక్షకులు తనను ఆదరిస్తారని తెలిపారు. గీత రచయిత శ్రేష్ట మాట్లాడుతూ.. పెళ్లిచూపులు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.