తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది గాలివాటం గెలుపని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ప్రజల బీఆర్ఎస్ కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని తెలిపారు.
BJP MP Laxman: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది గాలివాటం గెలుపని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ప్రజల బీఆర్ఎస్ కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్తో కలిసి ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే క్లారిటీతో అంతా మెల్లగా కూటమి నుంచి బయటకు వస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్, కేసులు, చేసిన అవినీతి నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ రహస్య ఒప్పందంతో ముందుకు వెళుతున్నాయని అన్నారు. ఎవరేం చేసినా.. ఎన్ని కుట్రలు పన్నినా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీదే గెలుపని తెలిపారు.
తెలంగాణలోనూ పార్లమెంట్ ఎన్నికల్లో 10 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పది సీట్లు గెలవడంతో పాటు మొత్తం 17 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పనిఅయిపోయినట్లే అని అన్నారు. తాము బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం ఎప్పటికీ జరుగదని అన్నారు. కాళ్ల బేరానికి వచ్చినా పొత్తు నో అంటామని చెప్పారు. రేపటినుంచి రాష్ట్రంలో బీజేపీ బస్సు యాత్రలు ప్రారంభమవుతాయన్నారు.