Cm Revanth: బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం
తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. నీటిపారుదల రంగంపై విపక్షాలు వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేశాయి. అయితే దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
Cm Revanth: తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. అయితే దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. నీటిపారుదల రంగంపై విపక్షాలు వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేశాయి. గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నా అని తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు ఇక్కడే పునాది పడింది.
గత ప్రభుత్వం తప్పులు అంగీకరించి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్తే బాగుండేది. వారు చేసిన తప్పులను అంగీకరించి సలహాలు ఇస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. తప్పులు అంగీకరించకుండా ఎదురుదాడి చేస్తున్నారు. మంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే తప్పుల తడక అంటున్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తుందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.