Body detox juices : శరీరంలోని విష పదార్థాల్ని బయటికి నెట్టివేసే జ్యూస్లు ఇవే!
మనలో పేరుకుపోయిన విష పదార్థాలు, చెత్తను ఎప్పటికప్పుడు బయటకు నెట్టేయాల్సిందే. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. అలాంటి బాడీ డిటాక్సిఫికేషన్ కోసం కొన్ని జ్యూస్లు మనకు సహకరిస్తాయి. అవేంటంటే...
detox juice for cleansing the body : మనం రోజూ కాలుష్యంలో తిరుగుతుంటాం. కలుషితమైన ఆహారాన్ని తింటుంటాం. రసాయనాలతో ట్రీట్ చేసిన ప్రోసెస్డ్ ఆహారాలనీ తింటుంటాం. ఇవన్నీ అప్పటికప్పుడు మన ఆరోగ్యంపై ప్రభావం చూపించకపోవచ్చు. కానీ కాల క్రమేణా అవి మన శరీరంలో విష పదార్థాలుగా పేరుకుపోయి దీర్ఘ కాలిక వ్యాధులు వచ్చేలా చేస్తాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలంటే మనం నెలకొకసారైనా మన శరీరాన్ని డిటాక్స్(detox) చేసుకోవాలి. అందుకు కొన్ని జ్యూస్లు మనకు సహకరిస్తాయి. అవేంటంటే..
కమలా, బత్తాయి, నారింజ, ద్రాక్ష.. లాంటి మనకు ఇష్టం వచ్చిన సిట్రస్ జాతికి చెందిన పండ్ల ముక్కలను తీసుకోవాలి. వాటికి పుచ్చకాయను జత చేసి జ్యూస్ తీసుకోవాలి. ఇవి లాలాజల గ్రంథుల పని తీరును మెరుగుపరుస్తాయి. తిన్న పదార్థాలు మెరుగ్గా జీర్ణం అయ్యేలా చేస్తాయి. శరీరంలో పేరుకున్న వ్యర్థాలను బయటకు నెట్టి వేస్తాయి. బచ్చలి, పుదీనాలను కలిపి రసం చేసుకుని తాగడం వల్ల శరీరానికి సరిపడ ఐరన్ అందుతుంది. అది శరీరాన్ని శుభ్రం చేయడంలో సహకరిస్తుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ని అందించి మనిషి బద్ధకంగా లేకుండా చేస్తుంది.
బాడీ డిటాక్స్(Body detox) కోసం అద్భుతంగా పని చేసే జ్యూసుల్లో ఇది ఒకటి. తాజాగా ఉన్న కొత్తిమీరను తీసుకోవాలి. దానికి అల్లాన్ని చేర్చి రసం తీసుకుని తాగొచ్చు. ఇది మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే తిన్న ఆహారం నుంచి పోషకాలు అన్ని సరిగ్గా శరీరానికి అందేలా చేస్తుంది. క్యారెట్, కాంబినేషన్ జ్యూస్ కూడా మంచి డిటాక్సిఫికేషన్ జ్యూస్ అని చెప్పవచ్చు. ఇంకా బత్తాయి, దోసకాయ, కర్భూజ కాయల ముక్కల్ని సమ భాగాలుగా తీసుకోవాలి. వీటిని రసం చేసుకుని వడగట్టుకుని తాగాలి. ఇది శరీరంలో ద్రవ రూపంలో ఉన్న విష పదార్థాల్ని బయటకు నెట్టి వేస్తుంది. కమల, పుదీనా జ్యూస్ వల్లా ఈ ఫలితాలు ఉంటాయి.