Tulsi Leaves : ఉదయాన్నే తులసాకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
మన ఇళ్ల దగ్గర చాలా తేలికగా అందరికీ అందుబాటులో ఉండే మొక్క తులసి. దీని ఆకుల్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరూ తప్పకు ప్రయత్నిస్తారు.
Eat tulsi Leaves in the morning : దాదాపుగా ప్రతి తెలుగు వారి ఇంట్లోనూ తులసి మొక్క అనేది తప్పకుండా ఉంటుంది. దీన్ని మనం దైవంగా భావించి పూజలు చేస్తాం. ఇలాంటి పవిత్రమైన మొక్కలో ఔషధ గుణాలు బోలెడున్నాయి. రోజూ కాసిన్ని తులసి ఆకుల్ని పరగడుపున తీసుకోవడం వల్ల ఫ్లూ, కఫ సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా వీటికి కొన్ని కొన్ని పదార్థాలను కలిపి సేవించడం వల్లా ఎన్నో ప్రయోజనాలను మనం పొందొచ్చు.
జలుబు, దగ్గు లాంటివి కొంత మందికి తరచుగా వస్తూ ఉంటాయి. అలాంటి వారు గుప్పెడు తులసి ఆకుల్ని(tulsi Leaves) తీసుకుని నీటిలో వేయాలి. వాటిని గ్యాస్ పొయ్య మీద పెట్టి మరుగనివ్వాలి. అందులో కొద్దిగా సొంఠి, మిరియాల పొడి వేసి కషాయంలో తయారు చేసుకుని తాగితే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే కొంత మందికి జ్వరం తరచుగా వస్తూ ఉంటుంది. అలాంటి వారు తులసి, పుదీనా ఆకుల రసాన్ని నేరుగా తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు లేకుండా చూస్తుంది.
వాతావరణంతో మంచుతో ఉన్నప్పుడు చాలా మందికి గొంతు నొప్పి లాంటివి వస్తుంటాయి. ఇలాంటి వారు తులసి ఆకుల్ని నీటిలో వేసి మరిగించి గోరు వెచ్చగా వాటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. దీనిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల గొంతు నొప్పి, వాపులాంటివి తగ్గుముఖం పడతాయి. అలాగే తులసాకుల(tulsi Leaves) రసంలో తేనె కలిపి ఉదయాన్నే తాగడం వల్ల నోటి పూత, గొంతు నొప్పి, బొంగురు గొంతు లాంటివి సరౌతాయి.