అమెరికాలో భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. నీ భర్త ఎక్కడ? అంటూ పరిహాసమాడారు. దీంతో ఆమె దీనిపై ఘాటుగా స్పందించారు.
Trump attacks Haley : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారత సంతతి మహిళ నిక్కీ హేలీపై మరోసారి నోరు పారేసుకున్నారు. సౌత్ కరోలినాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ‘నీ భర్త ఏమైపోయాడు?’ అంటూ పరిహాసం ఆడారు. అయితే ఈ కామెంట్స్ పట్ల నిక్కీ ఘాటుగా స్పందించారు. ట్రంప్ ఏమైనా చెప్పాలనుకుంటే చర్చా వేదికలపై నా ఎదుటే మాట్లాడాలని సవాల్ విసిరారు. తన భర్త సైనిక సేవల్లో విదేశాల్లో ఉండటం తనకు గర్వ కారణం అన్నారు. నా భర్త మైఖేల్ దేశం కోసం కోసం సేవలు అందిస్తున్నారు. ఇలాంటి కామెంట్లు చేయడం సైనిక కుటుంబాన్ని అవమానించడమేనని ఆమె మండి పడ్డారు. 75 ఏళ్లు పైబడిన రాజకీయ నేతలందరికీ సైకలాజికల్ పరీక్షలు చేయించాలని అందులో ట్రంప్ పాస్ కావడం కూడా కష్టమేనని ఆమె అన్నారు.
రిపబ్లికన్ పార్టీ(Republican party) తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం నిక్కీ హేలీ( Nikki haley), డొనాల్డ్ ట్రంప్‌లు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూఎస్‌లో పార్టీ ప్రైమరీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వీరిద్దరూ ఇప్పుడు ర్యాలీలు, ప్రచార సభల్లో పాల్గొంటూ ఉన్నారు. అందులో భాగంగానే ట్రంప్ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేల భర్త మైఖేల్ హేలీ సైనిక విధులు నిర్వర్తించడంలో భాగంగా విదేశాల్లో తన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది జూన్ నుంచి ఆయన ‘హార్న్ ఆఫ్ ఆఫ్రికా’ ప్రాంతంలో విధులు నిర్వర్తుస్తున్నానరు. ఈ విషయంపై పెద్దగా అవగాహన లేని ట్రంప్ ఇలా వ్యాఖ్యలు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.