Nagoba Jatara 2024: ఆదివాసుల అతిపెద్ద పండుగ నాగోబా జాతర(Nagoba Jatara) ప్రారంభం అయింది. ఆదిలాబాద్(Adilabad) జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో అత్యంత ఘనంగా నాగోబా జాతర ఫిబ్రవరి 9న ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం పీఠాధిపతి మెస్రం వెంకట్రావు ఆధ్వర్యంలో నాగోబా గుడి వద్ద పూజలు నిర్వహించారు. నాగోబా విగ్రహాన్ని నాయక్వాడి మెస్రం ధర్ము తలపై ఎత్తుకొని ఆలయానికి వచ్చారు. ఆలయ ప్రాంగనంలో పుట్టలను తయారు చేయడానికి మహిళలు కోనేరు నుంచి మట్టి కుండల్లో నీటిని తీసుకొచ్చారు. అనంతరం పుట్టమన్నుతో పుట్టలను తయారు చేశారు. రాత్రి మహాపూజలతో జాతర ప్రారంభం అయింది.
ఐదురోజులు జరిగే ఈ వేడుకలో ఎన్నో విశేషాలు ఉంటాయి. ఫిబ్రవరి 9న ప్రారంభం అయింది. ఫిబ్రవరి 11 న దర్భారు నిర్వహిస్తారు. మెస్రం వంశీయుల ఆధ్వర్యంలోప్రతీ సంవత్సరం ఎంతో అట్టహాసంగా ఈ వేడుక జరుగుతుంది. వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. అదిశేషున్ని తమ ధైవ్యంగా భావించే గిరజను ప్రతీ సంవత్సరం ఎంతో భక్తితో నాగోబాను కొలుస్తారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు పుట్టలను తయారు చేసి పాలు పోసీ పూజిస్తారు. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటు మాయమ వుతాయని గిరిజనుల నమ్మకం.