Crime: ప్రస్తుతం యువత ఎక్కువగా చెడు అలవాట్లకు దగ్గరవుతున్నారు. ఓ యువకుడు మొబైల్ ఫోనులో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని తండ్రి విషమిచ్చి చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని షోలాపూర్లో జరిగింది. విజయ్ బట్టు అనే అతను మిషన్ కుడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి విశాల్ అనే 14ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గ్రామానికి దగ్గర్లో ఉండే పాఠశాలలో విశాల్ చదువుకుంటున్నాడు. రోజు పాఠశాలకు మొబైల్ ఫోన్ తీసుకెళ్లి అక్కడ అశ్లీల చిత్రాలు చూసేవాడు. అంతటితో ఆగకుండా పాఠశాలలో బాలికలను కూడా వేధించేవాడు.
ఈ విషయాన్ని ఉపాధ్యాయులు చాలాసార్లు తండ్రికి చెప్పారు. దీంతో విసుగు చెందిన తండ్రి కుమారుడిని బైక్పై తీసుకెళ్లి కూల్డ్రింక్ తాగించాడు. ఇందులో విషం కలిపి ఇచ్చాడు. దీనిని తాగిన విశాల్ కొంత సమయం తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఒక కాలువలో పడేసి విజయ్ ఇంటికి వచ్చాడు. తర్వాత తన భార్యతో కలిసి కుమారుడు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. దగ్గర్లో మురికి కాల్వలో మృతదేహం కనిపించింది. దొరికిన ఆధారాలకు, మృతుడి తండ్రి చెప్పిన వివరాలకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంతలో విజయ్ చేశాన్ని నేరాన్ని భార్యకు చెప్పి లొంగిపోయాడు.