»Ambajipeta Marriage Band Movie Review Did Suhas Band Ring
Ambajipeta Marriage Band Movie Review: సుహాస్ బ్యాండు మోగించాడా?
యంగ్ హీరో సుహాస్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్లో హీరోగా నిలబడేందుకు, నటుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు శ్రమిస్తున్నాడు. సుహాస్ నటించిన అంబాజీ పేట మ్యారేజి బ్యాండు సినిమా విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో మల్లి (సుహాస్) ఒక సభ్యుడు. చిరతపల్లిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. ఆ ఊరి స్కూల్లో అక్క పద్మ (శరణ్య ప్రదీప్) టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఊర్లో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న వెంకట్‌బాబు (నితిన్ ప్రసన్న) వల్లే పద్మకి ఉద్యోగం వచ్చిందని, వాళ్లిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే ఓ పుకారు మొదలవుతుంది. ఇంతలో వెంకట్‌బాబు చెల్లెలు లక్ష్మి (శివాని నాగారం), మల్లి ప్రేమలో పడతారు. వెంకట్‌బాబు తమ్ముడికి, మల్లికీ మధ్య ఊళ్లో గొడవ, ఆ తర్వాత స్కూల్ విషయంలో పద్మకి, వెంకట్బాబుకి మధ్య గొడవ మొదలవుతుంది. ఆ గొడవులు పెద్దవి అవుతాయి. ఇంతలో మల్లి, లక్ష్మిల మధ్య ప్రేమ సంగతి కూడా బయట పడుతుంది. ఎలాగైనా ఆ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని వెంకట్‌బాబు పద్మని స్కూల్‌కి పిలిపించి అవమానిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మల్లి, లక్ష్మిల ప్రేమ సక్సెస్ అయ్యిందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
మల్లి, లక్ష్మిల ప్రేమకథతో మొదలయ్యే కథ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ ఊరు చిరతపల్లికి ప్రేక్షకుల్ని తీసుకెళ్లి అందులో ఓ పాత్రలా మారుస్తుంది. సహజమైన సన్నివేశాలు, పాత్రల తీరుతెన్నులు, సంభాషణలు అంతగా ప్రభావం చూపిస్తాయి. ప్రేమకథలో కొత్తదనమేమీ లేదు కానీ.. 2007 నాటి వాతావరణం, అప్పుడప్పుడే సెల్ఫోన్లు వస్తున్న ఆ కాలం నాటి ప్రేమలేఖల నేపథ్యంతో సినిమా సరదా సరదాగా సాగుతుంది. మరోవైపు కులాల మధ్య అంతరాల్ని, ఆర్థిక అసమానతల్నీ సహజంగా ఆవిష్కరిస్తూ కథతో కనెక్ట్ చేశాడు దర్శకుడు. విరామం ముందు నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. అప్పటిదాకా ప్రేమకథే కీలకం కాగా, ఆ తర్వాత నుంచి ఆత్మాభిమానం అంశం ప్రధానంగా మారుతుంది. ద్వితీయార్ధం మల్లి, అతని కుటుంబం చేసే పోరాటం చుట్టూనే సాగుతుంది. కథ ఊహకు తగ్గట్టే సాగుతున్నా, బలమైన సన్నివేశాలతోనూ, డ్రామాతోనూ ప్రభావం చూపించాడు దర్శకుడు. పోలీస్ స్టేషన్లో సాగే సన్నివేశాలు.. ప్రేమ ప్రాణాల మీదకు తేకూడదు అంటూ మల్లి, లక్ష్మి తీసుకునే నిర్ణయం, ఆ నేపథ్యంలో పండే భావోద్వేగాలు చిత్రానికి ప్రధానబలం. పతాక సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు నాటకీయంగా, ఎక్కువ స్వేచ్ఛని తీసుకుని మలిచినట్టు అనిపించినా సినిమా మాత్రం ప్రేక్షకులపై బలమైన ప్రభావమే చూపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
ఎవరి పాత్రల్లో వాళ్లు ఒదిగిపోయారు. మల్లి పాత్రలో సుహాస్ జీవించేశాడు. ఎవరి పాత్రలకు వాళ్లు పూర్తి న్యాయం చేశారు. శరణ్య ప్రదీప్తోనే ఈ సినిమా మొత్తం తిరుగుతుంది. ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు, అందులో ఆమె నటించిన విధానం సినిమాకే హైలెట్.
సాంకేతిక అంశాలు
సాంకేతిక విభాగాలన్నీ బాగున్నాయి. శేఖర్ చంద్ర పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి బలం. ఎడిటింగ్, బలమైన రచన బాగున్నాయి. చాలా సంభాషణల్లో ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఈ విషయంలో దర్శకుడు విజయం సాధించాడు.
ప్లస్ పాయింట్స్
+కథ
+భావోద్వేగాలు
+సుహాస్, శరణ్య నటన