ఆంధ్రుల ఆత్మగౌరవం మోసే మన యువనేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై.. అంటూ సాగే యువగళం పాటను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. సోషల్ మీడియాలో యువగళం పేరుతో ఈ పాటను విడుదల చేసింది. నారా లోకేశ్ శుక్రవారం నుంచి యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇవాళ పాదయాత్రలో రెండో రోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. వస్తుందదిగో యువగళం.. తెస్తుందదిగో నవశకం అంటూ ఈ పాట సాగుతుంది. మొత్తానికి ఈ పాట విడుదలైన రెండు గంటల్లోనే సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది.