GOA : బీచ్‌కెళ్లి ఎంజాయ్ చేద్దామని చెప్పి.. భార్యను సముద్రంలో ముంచి చంపిన భర్త
ఓ భర్త తన భార్యను సముద్రంలో ముంచి చంపేశాడు. ఈ ఘటన గోవా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గౌరవ్ కతియార్ గోవాలోని ఓ హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
GOA : ఓ భర్త తన భార్యను సముద్రంలో ముంచి చంపేశాడు. ఈ ఘటన గోవా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గౌరవ్ కతియార్ గోవాలోని ఓ హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది దీక్షా గంగ్వాడ్ (27)తో వివాహమైంది. కొద్దిసేపటికే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని భార్య ఆరోపించింది. దీంతో గౌరవ్ కటియార్ ఎలాగైన తన భార్యను అడ్డు తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం ఆమెను గోవాలోని ‘కాబో డి రామ’ బీచ్‌కి తీసుకెళ్లాడు.
అక్కడ ఇద్దరూ కలిసి నీటిలోకి దిగారు. ఆమెను నీటిలో ముంచి చంపేశాడు. ఇద్దరు నీళ్లలోకి వెళ్లి ఒక్కరు మాత్రమే తిరిగి రావడాన్ని పర్యాటకుల్లో ఒకరు గమనించి వీడియో తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తన భార్య ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిందని, ఆమెను రక్షించలేకపోయానని పోలీసులకు అబద్ధం చెప్పాడు. ఓ పర్యాటకుడు తీసిన వీడియోలో గౌరవ్ తన భార్య చనిపోయిందని నిర్ధారించుకుని నీళ్లలో నుంచి బయటకు రావడం స్పష్టంగా కనిపించింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నీటిలో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు.