»The Tension In Gudiwada Is A Fight Between The Janasena And Tdp Ranks For The Police
Janasena and TDP: గుడివాడలో ఉద్రిక్తత.. పోలీసులకు జనసేనా, టీడీపీ శ్రేణులకు తోపులాట
గుడవాడ పోలీసులకు జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహం వద్దకు అనుమతించకపోవడంతో ఈ గొడవ మొదలైంది.
The tension in Gudiwada is a fight between the Janasena and TDP ranks for the police
Janasena and TDP: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్(NTR) వర్ధంతి సందర్భంగా గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివంగత నేత ఎన్టీఆర్కు నివాళి అర్పించేందుకు వస్తున్న టీడీపీ(TDP), జనసేన(Janasena) శ్రేణులను ఆయన విగ్రహం వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. స్టాచ్యూ దగ్గరకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎందుకని ప్రశ్నించినా పార్టీ శ్రేణులు సహనం కొల్పోయారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ, జనసేన శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ విగ్రాహం వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. ఆయనకెందుకు అనుమతి ఇచ్చారు అని పోలీసులపై గుడివాడ టీడీపీ ఇన్ఛార్జీ వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నానికి ఒక న్యాయం తమకు ఒక న్యాయం అంటూ ప్రశ్నించారు. నివాళి అర్పించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తామని అక్కడే రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడి వచ్చి నిరసన తెలిపారు. పోలీసులు మొండికేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.