»Mamata Banerjee Jamili Does Not Agree With Elections
Mamata Banerjee: జమిలి ఎన్నికలతో ఏకీభవించడం లేదు
లోక్సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ఒకే దేశం - ఒకే ఎన్నికతో ఏకీభవించడం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు.
Mamata Banerjee: లోక్సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ఒకే దేశం – ఒకే ఎన్నికతో ఏకీభవించడం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీకి లేఖ రాశారు. ఈ జమిలి ఎన్నికల విధానం భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమని తెలిపారు. నేను నిరంకుశత్వానికి వ్యతిరేకం. అందుకే జమిలి ఎన్నికలకు దూరమని మమతా తెలిపారు. భారత రాజ్యాంగం ఒకే దేశం – ఒకే ప్రభుత్వం అనే భావనను అనుసరించడం లేదని మమతా తెలిపారు.
కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కారణాల వల్ల తమ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయకపోవచ్చు. గత 50 ఏళ్లలో లోక్సభ అనేకసార్లు ముందస్తుగా రద్దయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఎన్నికలు నిర్వహించడమే మార్గం. కేవలం ఏకకాలంలో ఎన్నికల కోసమే ముందుస్తుకు వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి చేయరాదు. ఇలా చేస్తే ఐదేళ్ల పాలన విషయంలో ఓటర్ల ఎన్నికల విశ్వాసాన్ని ఉల్లంఘించడమే అవుతుందని మమతా తెలిపారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక కోసం గతేడాది సెప్టెంబరులో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు సమావేశాలు నిర్వహించింది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలను తీసుకుంది.