»Sankranthi Movie Business Run Time Of Sankranthi Movies Pre Release Business Details
Sankranthi Movie Business: సంక్రాంతి సినిమాల రన్ టైం, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు!
ఈసారి సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి ఏకంగా నాలుగు సినిమాలు దూసుకొస్తున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా సాలిడ్ బజ్‌తో థియేటర్లోకి రాబోతున్నాయి. మరి ఈ సినిమాల రన్ టైం ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
Sankranthi Movie Business: మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ వరుసగా థియేటర్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కంప్లీట్ చేసుకున్నాయి. గుంటూరు కారం 120 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా 125 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. తేజ సజ్జా హనుమాన్, వెంకీ మామ సైంధవ్ సినిమాలు 24 కోట్ల బిజినెస్‌తో 25 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వస్తున్నాయి. ఇక నాగార్జున నా సామిరంగ 16 కోట్ల బిజినెస్ 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగుతోంది.
ఇక ఈ సినిమాల సెన్సార్ రిపోర్ట్స్ కూడా అదిరిపోయాయి. అన్ని సినిమాలు కూడా యు/ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకున్నాయి. రన్ టైం కూడా లాక్ చేసుకున్నాయి. జనవరి 12న రిలీజ్ కానున్న గుంటూరు కారం సినిమా రెండు గంటల 39 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి రానుంది. అదే రోజు రిలీజ్ కానున్న హనుమాన్ కూడా ఇంచు మించు ఇదే రన్ టైంతో రెండు గంటల 38 నిమిషాల నిడివితో రానుంది. ఇక హిట్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను.. వెంకీ మామ సైంధవ్ విషయానికి వస్తే.. రెండు గంటల 20 నిమిషాల రన్ టైంతో జనవరి 13న ఆడియెన్స్ ముందుకు రానుంది.
ఫైనల్‌గా జనవరి 14న రిలీజ్ కానున్న నాగార్జున నా సామిరంగ.. రెండు గంటల 26 నిమిషాల రన్ టైం లాక్ చేసుకుంది. ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా మారాడు. ఈ నాలుగు సినిమాల్లో.. గుంటూరు కారం రన్ టైం ఎక్కువగా ఉండగా.. వెంకీ సైంధవ్ తక్కువ నిడివితో రాబోతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో చూడాలి.