ఈ మధ్య దొంగలు బాగా అప్ డేట్ అయ్యారు. టెక్నాలజీ ఎలా అప్ డేట్ అవుతుందో దొంగలు కూడా అలాగే అప్ డేట్ అవుతూ స్మార్ట్ గా దొంగతనాలు చేసి కోట్లకు కోట్లు కొల్లగొడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు. కొందరు దొంగలు కేవలం ఏటీఎం మిషన్లనే టార్గెట్ చేసుకుంటారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నా ముఖానికి ముసుగు వేసుకొని ఏటీఎంలను దోచుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ లోని అజ్మీర్ లో వరుసగా ఏటీఎంలలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకెళ్లారు.
గురువారం అంటే జనవరి 26 న అర్ధరాత్రి ఒకటిన్నరకు ఈ ఘటన చోటు చేసుకుంది. ముసుగులో వచ్చిన ఇద్దరు దుండగులు అరెయిన్, రూపాన్ ఘర్ అనే ప్రాంతాల్లో ఉన్న రెండు ఏటీఎంలను దోచుకున్నారు. ఒక ఏటీఎం మిషన్ ను అయితే ముక్కలు చేసేశారు. ఒక దాంట్లో నుంచి రూ.8 లక్షలు, మరో మిషన్ నుంచి రూ.30 లక్షలు దోచుకెళ్లారు. మొత్తం రూ.38 లక్షలు రెండు ఏటీఎం మిషన్ల నుంచి మిస్ అయినట్టు అధికారులు తెలిపారు. చాలా రోజుల నుంచి రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో ఈ తరహా ఏటీఎం దొంగతనాలు జరుగుతున్నాయని.. ఇది ఖచ్చితంగా ఒక గ్యాంగ్ పనే అని, వాళ్లను త్వరలోనే పట్టుకొని తీరుతామని అజ్మీర్ రూరల్ అడిషన్ ఎస్పీ వైభవ్ శర్మ తెలిపారు. ఏటీఎం మిషన్ లో దోచుకునే సమయంలో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ ను అధికారులు విడుదల చేశారు.
ATM machines looted in Arain & Roopangarh. Rs. 8 Lakhs & Rs. 30 Lakhs were stolen. Robbery method in both cases identical so it could be same gang: Vaibhav Sharma, Additional SP, Rural pic.twitter.com/CszNQ28A91