PLD: క్రోసూరులో మట్టల ఆదివారం వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. పూర్వం నజరేయుడైన యేసుక్రీస్తు గాడిదపై యెరూషలేములోకి ప్రవేశించిన చారిత్రక ఘట్టాన్ని స్మరిస్తూ పాస్టర్లు, విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సండే స్కూల్ విద్యార్థులు, చిన్నపిల్లలు చేతుల్లో ఈత మట్టలు పట్టుకుని “హోసన్నా.. క్రీస్తు రాజుకు జై” అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు.