ఏపీలోఅంగన్వాడీ జీతాలు పెంచాలని కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. ప్రస్తుతం 21వ రోజు సమ్మె జరుగుతోంది. ఈక్రమంలో కార్యకర్తలు మాట్లాడుతూ.. జీతాలు పెంచకపోతే ఈసారి రాష్ట్రంలో వైసీపీ అడ్రస్ లేకుండా చేస్తామని వ్యాఖ్యనించారు.
Anganwadi Workers: అంగన్వాడీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమ్మె 21వ రోజు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ తమ వేతనాలు పెంచేలా బటన్ నొక్కాలని లేకపోతే మూడు నెలల్లో తాము నొక్కే బటన్‌తో వైసీపీ ఔట్ అవుతుందని కార్యకర్తలు మచిలీపట్నం సమ్మెలో తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కార్మికులు తమ సమ్మె శిబిరంలో కేక్ కట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం రోజున ఇళ్లలో ఉండాల్సిన మమ్మల్ని ముఖ్యమంత్రి జగన్ నడి రోడ్డు మీద కూర్చోబెట్టారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1.10 లక్షల మంది కార్యకర్తలు సమ్మెలో ఉంటే ఇంత నిర్లక్ష్యమా అని అన్నారు. ఎన్నికల ఓట్ల కోసం హామీలు ఇచ్చింది మీరే కదా. మీ మాటలను నమ్మి ఓట్లు వేస్తే ఇంత అన్యాయం చేస్తారా? అని కార్యకర్తలు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్యకర్తలు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించామంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు.