»Drunk And Drive At The Time Of New Years Celebrations There Are A Lot Of Cases Of Drunk And Drive In Hyderabad
Drunk and Drive: న్యూఇయర్ వేడుకల వేళ.. హైదరాబాద్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రాత్రి 8 గంటల నుంచే తనిఖీలు నిర్వహించి భారీగా కేసులు నమోదు చేశారు.
Drunk and Drive: హైదరాబాద్లో న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. అర్థరాత్రి రోడ్లపై తిరుగుతూ, పటాకులు కాలుస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఈ వేడుకల వేళ హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రాత్రి 8 గంటల నుంచే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో మొత్తం 2700కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్లో 1500లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇలా తాగి వాహనాలు నడిపిన వాళ్లలో మహిళలు కూడా ఉన్నారు. తాగి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి కూడా దిగారు.