»Chief Minister Revanth Reddy Gave Delivery Boys Family Rs 2 Lakhs In Finance
Revanth Reddy: డెలివరీ బాయ్ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థికసాయం
హైదరాబాద్‌లో నాలుగు నెలల క్రితం డెలివరీ బాయ్‌గా పనిచేసే వ్యక్తి ఫుడ్ డెలివరీ చేస్తుండగా మరణించాడు. మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి డెలివరీ బాయ్ కుటుంబానికి రూ. 2 లక్షలను అందించారు.
Chief Minister Revanth Reddy gave delivery boy's family Rs. 2 lakhs in finance
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబాన్ని ఆదుకున్నారు. ముందే చెప్పినట్లు ఈరోజు ఆ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. నాలుగు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన డెలివరీ బాయ్(delivery boy) ఫ్యామిలీకిి సీఎం సహాయనిధి(CM Relief Fund) కింద సాయం అందించారు. రేవంత్ రెడ్డి ఈ నెల 23న గిగ్ వర్కర్లతో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాలుగు నెలల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదాన్ని ప్రస్తావించారు. ఫుడ్ డెలివరీ డ్యూటీలో ప్రమాదవశాత్తు మరణించిన డెలివరీ బాయ్ కుటుంబానికి గత ప్రభుత్వం ఏదైనా ఆర్థిక భరోసా కల్పిస్తుందని భావించాను, కానీ వారు పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన డెలివరీ బాయ్ కుటుంబం వివరాలు తెలుసుకొని ఈ రోజు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షలు సీఎం రేవంత్ రెడ్డి అందించారు.