టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాలార్ చిత్రం కలెక్షన్ల హావా సృష్టిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఇప్పుడు చుద్దాం.
ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సాలార్’ చిత్రం నిన్న విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ ట్రాకింగ్ సైట్ Sacnilk ప్రకారం ఈ సినిమా దేశంలో అడ్వాన్స్ సేల్స్ 49 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ క్రమంలో అన్ని భాషల్లో కలిపి రూ.112 కోట్లు వచ్చినట్లు అంచనాలను ప్రకటించింది. అయితే ఈ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనే 70 కోట్ల రూపాయలు రావడం విశేషం.
‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు సహా పలువురు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. ముందుగా చెప్పినట్లు ‘సాలార్’ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగానికి ‘సాలార్: పార్ట్ 1 – కాల్పుల విరమణ’ అని, రెండవ భాగానికి ‘శౌర్యాంగ పర్వం’ అని పేరు పెట్టారు. ‘సాలార్: మొదటి భాగం – కాల్పుల విరమణ’ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడతో సహా పలు భాషల్లో విడుదలైంది. ఈ క్రమంలో ఈ సినిమా ఇప్పటికే డిసెంబర్ 21న విడుదలైన పాన్ ఇండియా చిత్రం షారూఖ్ ఖాన్ ‘డుంకీ’తో పోటీ పడుతోంది.