»This Is The Second Time Prashant Neel Hit Shahrukh Out
Prashant Neel: ఇది రెండోసారి.. ప్రశాంత్ నీల్ దెబ్బకు షారుఖ్‌కు ఔట్!
హీరోలకు ఎలివేషన్ ఇవ్వాలంటే నీల్ తర్వాతే.. ఎవ్వరైనా అనేలా కెజియఫ్ సిరీస్, సలార్ పార్ట్ వన్ను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్‌కు హిట్ నీల్.. షారుఖ్ ఖాన్‌కు మాత్రం రెండో దెబ్బ గట్టిగా వేశాడు.
సలార్ పార్ట్ 1లో ప్రభాస్ కటౌట్‌ను ఎలా వాడుకోవాలో.. అలా వాడుకున్నాడు ప్రశాంత్ నీల్. అయితే.. నీల్ తన హీరోలతో మాత్రమే యుద్ధం చేయించడు. తను కూడా బాక్సాఫీస్ దగ్గర కొండను ఢీ కొడుతుంటాడు. ఇప్పటికే ఓ సారి విన్నర్‌గా నిలిచిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు మరోసారి జెండా ఎగరేశాడు. జస్ట్ కన్నడకే తెలిసిన యష్ లాంటి హీరోని పట్టుకొని.. కెజియఫ్ పార్ట్ వన్ సినిమాతో ఏకంగా కింగ్ ఖాన్ షారుఖ్‌తో పోటీ పడ్డాడు. 2018లో KGF 1 సినిమాని షారుఖ్ జీరో మూవీకి పోటీగా రిలీజ్ చేసి, షారుఖ్‌ని అయిదేళ్ల పాటు రెస్ట్ మోడ్‌లోకి పంపాడు నీల్. ఇక ఇప్పుడు పఠాన్, జవాన్ అంటూ వరుస హిట్స్ కొట్టిన షారుఖ్ డంకికి పోటీగా మళ్లీ సలార్‌ని దించాడు.
నిజానికైతే.. డంకీ రిలీజ్ డేట్‌నే ముందుగా ప్రకటించాడు షారుఖ్. అయితే.. షారుఖ్ పై పగబట్టాడో లేక యాక్సిడెంటల్‌గా జరుగుతుందో తేలియదు కానీ.. అయిదేళ్ల తర్వాత కూడా వెతుక్కుంటూ వెళ్లి మరీ షారుఖ్ డంకీకి పోటీగా సలార్ రిలీజ్ చేశాడు నీల్. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇది డంకీకే రిస్క్ అని అన్నారు. డైనోసర్ దాడిని డంకీ తట్టుకోవడం కష్టమన్నారు. కానీ హ్యాట్రిక్ హిట్ లోడింగ్ అంటూ.. బాలీవుడ్ వర్గాలు గొప్పలు పోయాయి. కానీ డంకీ టాక్ షారుఖ్ అభిమానులు సహా నార్త్ ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చింది.
సలార్ మాత్రం మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మాస్ సినిమా కాబట్టి సలార్ కారణంగా డంకీ మూవీకి ఊహించని లాస్ ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా.. ప్రశాంత్ నీల్ కావాలనే షారుఖ్‌తో పోటీ పడ్డాడా? లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు గానీ.. షారుఖ్‌కు మాత్రం ప్రశాంత్ నీల్ చేతిలో ఇది రెండో దెబ్బ అనే చెప్పాలి.